33.2 C
Hyderabad
May 15, 2024 13: 49 PM
Slider ముఖ్యంశాలు

ఓయూలో విద్యార్థుల అందోళన

#OU

ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. సిలబస్ పూర్తి కాకుండానే పరీక్షలు పెట్టడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూజీసీ రూల్స్ ప్రకారం సెమిస్టర్‌కు కనీసం 120 పని దినాల తర్వాతే పరీక్షలు పెట్టాల్సి ఉంటుంది.

అయితే కనీసం రెండు నెలలు కూడా పాఠాలు చెప్పకుండానే ఓయూ అధికారులు పరీక్షలు పెడుతున్నారు. దీంతో పీజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. సిలబస్ పూర్తైన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు నిరసనకు దిగారు. పరీక్షల నిర్వహణపై వీసీకి వారం రోజుల క్రితం వినతి పత్రం ఇచ్చినప్పటికీ స్పందన రాలేదు.

ఈ క్రమంలో నిరసన తెలిపేందుకు వీసీ ఛాంబర్ వెళ్తున్న విద్యార్థులను హాస్టల్‌లోనే ఓయూ సెక్యూరిటీ బంధించింది. దీంతో ఓయూలో జరుగుతున్న ఇంటర్నల్ పరీక్షలకు విద్యార్థులు బాయ్ కాట్ చేశారు. వర్షంలోనే విద్యార్థులు తమ నిరసనను కొనసాగిస్తున్నారు.

Related posts

‘‘కేంద్ర ఎన్నికల సంఘ సూచనకు విరుద్ధంగా పని చేస్తున్నారు’’

Satyam NEWS

వ్యాక్సిన్ అపోహలపై పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్

Satyam NEWS

వాయిద్య కళాకారుల సంఘం ములుగు మండల కార్యవర్గం ఎన్నిక

Satyam NEWS

Leave a Comment