29.7 C
Hyderabad
April 29, 2024 10: 24 AM
Slider ముఖ్యంశాలు

కాళేశ్వరం వద్ద పెరుగుతున్న గోదావరి

#Kaleswaram

జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. జయశంకర్ జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరంలో గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతుంది. మహరాష్ట్ర, తెలంగాణ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత, గోదావరిలోకి భారీగా నీరు వచ్చి చేరుతుండడంతో కాళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతుంది. కాళేశ్వరం పుష్కర ఘాట్ మెట్ల వద్ద 7.520 మీటర్ల ఎత్తుకు గోదావరి నీటి మట్టం చేరుకుంది.

ఎగువ నుండి అన్నారం సరస్వతి బ్యారేజ్ కి 7,590 క్యూసెక్కుల వరద ప్రవాహం రావడంతో అన్నారం బ్యారేజ్ లో 8.08 టీఎంసీల నీటి నిల్వ చేరింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు వరద తాకిడి పెరగడంతో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ 35 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు.

ఇన్ ఫ్లో 1,62,820 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 2,10,830 క్యూసెక్ లుగా వుంది. బ్యారేజీ సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా ప్రస్తుతం 10.330టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Related posts

రాష్ట్ర స్టాయి షార్ట్ ఫిల్మ్ పోటీల కోసం 30 వ తేది లోపు సీడీలు అందజేయాలి

Satyam NEWS

కేసీఆర్ నామస్మరణ జపం కోసమే ఆరాటం

Satyam NEWS

డిమాండ్: ఎన్నికలు వాయిదా కాదు వెంటనే రద్దు చేయాలి

Satyam NEWS

Leave a Comment