26.7 C
Hyderabad
April 27, 2024 09: 00 AM
Slider రంగారెడ్డి

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి

#uppal

విద్యాసంస్థల ప్రారంభం సందర్భంగా పాఠశాలలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి పడాల శంకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు భారత విద్యార్థి ఫెడరేషన్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కమిటీ జిల్లా విద్యాధికారి ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. సెప్టెంబర్ 1 నుంచి   విద్యాసంస్థల ప్రారంభం ప్రభుత్వ నిర్ణయాన్ని ఎస్ ఎఫ్ ఐ స్వాగతిస్తుందని వారు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పడాల శంకర్ మాట్లాడుతూ మేడ్చల్ జిల్లాలో 1831 పాఠశాలలను ఆరు లక్షల మంది విద్యార్థులు పాఠశాల విద్యలో చదువుతున్నారని తెలిపారు. అందులో 73 వేల మందికి పైగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉన్నారని, వాటిలో 82 శాతం మంది ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల పై ఫీజులు చెల్లిస్తూ చదువుతున్నారని ఆయన తెలిపారు.

విద్యార్థులు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే కంటే ముందే కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రభుత్వ విద్యా సంస్థలు అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని, ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యాసంస్థల ప్రారంభం అయ్యాక విద్యార్థులు, తల్లిదండ్రుల పై ఫీజుల భారం ఒత్తిడి పెట్టకూడదని అతిగా ఒత్తిడి కోసం ఫీజులు వసూలు చేసే విద్యా సంస్థల పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

500కు పైగా సంఖ్య ఉన్న విద్యాసంస్థలను పాఠశాల విస్తీర్ణ స్థలం బట్టి షిఫ్ట్ లా వారిగా తరగతులు నిర్వహించాలని, ప్రతి విద్యార్థికి శానిటైజర్ మాస్క్ ప్రభుత్వమే అందజేయాలని, మండలాల్లో మండల విద్యాధికారులు ప్రతి విద్యా సంస్థను సందర్శించి కఠిన హెచ్చరికలు జారీ చేయాలని, మధ్యాహ్న భోజనం పౌష్టికాహారం అందించాలని డి ఈ ఓ కి తెలియజేశారు.

డీఈవో ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల పరిశుభ్రత కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అందరూ కూడా పుస్తకాలు అందజేశామని ప్రభుత్వం జారీ చేసిన అన్నిటిని కూడా జాగ్రత్తగా పకడ్బందీగా అమలు చేస్తామని సానుకూలంగా స్పందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి అఖిల జిల్లా కమిటీ సభ్యులు సాయి మణికంఠ ఉప్పల్ నియోజకవర్గ అధ్యక్షులు కాశీం నాయకులు సాయి తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆంధ్రప్రదేశ్ అంథకారం కాబోతోంది: టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల

Satyam NEWS

NTR: దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మూడక్షరాలు

Satyam NEWS

మూడు రోజుల పాటు క్రికెట్ టోర్నమెంట్ లు…!

Satyam NEWS

Leave a Comment