27.7 C
Hyderabad
April 26, 2024 05: 53 AM
Slider ఆదిలాబాద్

కొమురం భీం జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గా సత్తెన్న

#Kisan Congress

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షునిగా పెంచికల్పేట్ కు చెందిన చప్పిడి సత్తెన్నను నియమించారు. ఈ మేరకు రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి కౌటాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియామకపత్రం అందచేశారు.

ఈ సందర్భంగా అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతాంగ సమస్యల మీద కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలకు  ప్రణాళిక తయారు చేస్తున్నట్లు తెలిపారు. రైతాంగం ఎదుర్కొంటున్న ప్రతి సమస్య మీద కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి, సమస్యల పరిష్కారానికి కృషి చేయవలసిందిగా సూచించారు.

ఈ సందర్భంగా సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ డా.పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ పత్తి కొనుగోలు విషయంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేసిన పోరాటాల ఫలితంగా లాక్డౌన్ తర్వాత లక్షా ఇరవై వేల క్వింటాళ్ల పత్తిని సీసీఐ కొనుగోలు చేసిందని తెలిపారు.

దీనివల్ల సిర్పూర్ నియోజకవర్గ రైతులకు రూ.36 కోట్ల లాభం జరిగిందని ఆయన తెలిపారు. అలాగే వరి కొనుగోళ్ల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాటం చేసిందని అన్నారు.

పౌరసరఫరాల శాఖ అధికారులు రైస్ మిల్లర్ల తో కుమ్మక్కై ప్రతి క్వింటాలు ధాన్యానికి పెద్దఎత్తున 10-15 కిలోల తరుగు అని చెప్పి కటింగ్ చేసి రైతులకు అన్యాయం చేశారని ఆరోపించారు.

ఈ కార్యక్రమంలో  కౌటాల మండలం ఓబిసి చైర్మన్ పెద్దపెల్లి భీమన్న, చింతల మాన పెల్లి మండల మాజీ జెడ్పిటిసి  మల్లయ్య, బెజ్జూర్ మండల మాజీ వైస్ ఎంపీపీ తాళ్ల రామయ్య, ఎంపిటిసి దుర్గాం మోతీ రామ్ పాల్గొన్నారు.

ఇంకా, మాజీ ఎంపీటీసీ  రత్నం బావూజీ,  భగవంతం, మేకల తిరుపతి,  తిరుపతి గౌడ్,  కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు చప్పిడి సత్యనారాయణ, రాకేష్, నారాయణ, గునాజీ, ఉమా మహేష్, విజయ్,  వసిఖాన్ పాల్గొన్నారు.

Related posts

కరోనా పాజిటీవ్ కేసుల్లో 7వ స్థానానికి ఏపీ

Satyam NEWS

సవాళ్ళకు సమాధానం లేని బడ్జెట్‌

Murali Krishna

అస్సాం ముఖ్యమంత్రి పై తక్షణమే కేసు నమోదు చేయాలి

Satyam NEWS

Leave a Comment