కడప జిల్లా ప్రొద్దుటూరు నారాయణ పాఠశాలలో విద్యాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. చిత్తూరు డిప్యూటీ డీఈవో పురుషోత్తం తిరుపతి డిప్యూటీ డీఈఓ విజయేంద్ర రావు తనిఖీకి వచ్చారు. తనిఖీలలో భాగంగా పాఠశాలలో రికార్డు లను అధికారులు పరిశీలించారు. ఫీజులు వసూలు రసీదులను పరిశీలించారు. తల్లిదండ్రులతో మాట్లాడి పాఠశాల స్థితిగతులపై ఆరా తీశారు.