30.7 C
Hyderabad
April 29, 2024 05: 50 AM
Slider ప్రత్యేకం

కామెడీ పండించాడు కంటతడి పెట్టించాడు

#chandramohanactor

చంద్రమోహన్ మూడు త‌రాల సినీ ప్రపంచానికి వార‌ధి లాంటివాడు. ఆరోగ్యం బాగున్నంత కాలం తెరపై కనిపించిన రికార్డును కూడా చంద్రమోహన్ సొంత చేసుకున్నాడు. చంద్రమోహన్ తో బోణీ కొడితే చాలు మన కెరియర్ సూపర్ హిట్టు అని ఆ నాటి హీరోయిన్లు భావించేవారు. శ్రీ‌దేవి, జ‌య‌సుధ‌, జ‌య‌ప్ర‌ద‌, విజయశాంతి, రాధిక లాంటి హీరోయిన్లు చంద్రమోహన్ తో స్క్రీన్ పై కనిపించి సూపర్ హీరోయిన్లుగా మారారు.

హీరోగా నటిస్తూనే క్యారెక్టర్ యాక్టర్ గా కూడా చంద్రమోహన్ నటించాడు. అంతటి విశాలహృదయం ఉంది కాబట్టే అందరు హీరోలూ ఆయనను తమ సొంత సోదరుడిలా చూసుకునేవారు. మరీ ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ అయితే చంద్రమోహన్ ను తాను తీసిన అన్ని సినిమాల్లో పెట్టుకునేవారు. అల్లూరు సీతారామరాజులో గిరిజన యువకుడి పాత్ర పోషించినా ఈనాడు చిత్రంలో ఒక దళిత యువకుడు పాత్ర పోషించినా చంద్రమోహన్ తనదైన శైలితో నటించేవారు. అందరిని మెప్పించేవారు

హీరోగా కెరీర్ మొద‌లెట్టి, ఆ త‌ర‌వాత క‌మెడియ‌న్‌గా మారి, ఆ పిద‌ప క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా త‌న కెరీర్‌ని మ‌ల‌చుకొని, ద‌శాబ్దాలుగా వెండి తెర‌తో, చిత్ర‌సీమ‌తో మ‌మేక‌మై త‌న ప్ర‌యాణాన్ని చంద్రమోహన్ కొన‌సాగించారు. హైటు త‌క్కువ ఉన్నా, త‌న మొహంలో తేజ‌స్సు ఉండేది. న‌ట‌న‌లో ఉద్దండుల‌కు సైతం పోటీ ఇచ్చేవాడు. `ఇంకొంచెం హైటుంటే న‌న్నే మించిపోయేవాడు` అంటూ అక్కినేని చేత కితాబు అందుకొన్నాడు.

తొలి సినిమా `రంగుల రాట్నం`తోనే నంది అవార్డు ద‌క్కించుకొన్నాడంటే.. చంద్ర‌మోహ‌న్ ప్ర‌తిభ‌ను బేరీజు వేసుకోవొచ్చు. హీరోగా చేసిన 175 చిత్రాల్లో.. క‌నీసం 20, 30 మంచి హిట్టు ఉన్నాయి. `ప‌ద‌హారేళ్ల వ‌య‌సు` త‌న కెరీర్‌లో మ‌రో మ‌చ్చుతున‌క‌. చాలామంది హీరోయిన్ల‌కు చంద్ర‌మోహ‌న్ ల‌క్కీ హీరో. చంద్ర‌మోహ‌న్ ప‌క్క‌న న‌టించిన హీరోయిన్లు ఆ త‌ర‌వాత కాలంలో టాప్ పొజీష‌న్ కి చేరుకొన్నారు.

`నాతో న‌టించిన హీరోయిన్లు టాప్ స్టార్ల‌యిపోతే.. నేనిక్క‌డే ఉండిపోయాను` అని చంద్ర‌మోహ‌న్ కూడా చాలాసార్లు చెప్పేవారు. రాజేంద్ర ప్ర‌సాద్ – చంద్ర‌మోహ‌న్ ల మ‌ధ్య చ‌క్క‌టి కామెడీ కెమిస్ట్రీ కుదిరేది. ఈత‌రం హీరోల‌కు బాబాయ్‌, అన్న‌య్య‌, నాన్న‌… ఇలా అన్నీ తానై నిలిచాడు.

చంద్ర‌మోహ‌న్ మంచి భోజ‌న ప్రియుడు. కంచంలో అన్ని ర‌కాలైన ఆహార ప‌దార్థాలూ ఉండాల్సిందే. కెరీర్‌ని చాలా ప‌క‌డ్బందీగా మ‌ల‌చుకొన్న న‌టుడు ఆయ‌న‌. ఆర్థిక క్ర‌మశిక్ష‌ణ‌కు మారుపేరుగా నిలిచారు. ముర‌ళీమోహ‌న్‌, శోభ‌న్ బాబుకు మంచి ఆప్తుడు. వాళ్ల ప్రోద్బ‌లంతోనే స్థిరాస్థుల్లో పెట్టుబ‌డి పెట్టారు. ఆ రూపంలో చంద్ర‌మోహ‌న్ చాలా సంపాదించాడ‌న్న‌ది ఇండ‌స్ట్రీ వ‌ర్గాల టాక్.

చేతిలో సినిమాల్లేన‌ప్పుడు ఇల్లు విడిచి బ‌య‌ట‌కు వ‌చ్చేవారు కాదు. ఇంటి ప‌ట్టునే ఉండి, హోమియో మందులు అమ్మేవారాయ‌న‌. అన్నింటికంటే మరో ముఖ్య విష‌యం.. త‌ను అజాత శ‌త్రువు. ఇండ‌స్ట్రీలో అంద‌రితోనూ మంచి అనుబంధ‌మే ఉంది. వాళ్లంద‌రీ చంద్ర‌మోహ‌న్ మ‌ర‌ణం.. తీర‌ని లోటు.

Related posts

కంప్లయింట్: అమరావతి మహిళలపై తప్పుడు కేసులు

Satyam NEWS

19 నుంచి సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు ప్రారంభం

Satyam NEWS

ఉద్యోగులకు రెండేళ్లకే ప్రమోషన్

Satyam NEWS

Leave a Comment