37.2 C
Hyderabad
May 6, 2024 11: 45 AM
Slider రంగారెడ్డి

సిబిఐటి లో ఘనం గా ప్రారంభమైన సుదీ 2023

#sudhee

సిబిఐటి లో ఘనం గా సుదీ 2023 ఘనంగా ప్రారంభమైంది. పేపర్, పోస్టర్ ప్రెజెంటేషన్, లాన్ గేమింగ్, క్విజ్‌లు మరెన్నో సాంకేతిక ఈవెంట్‌లలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రారంభోత్సవంలో ఎల్‌టిఐ మైండ్‌ట్రీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకృష్ణ గొల్లపూడి ముఖ్య అతిథిగా విచ్చేసి తన విలువైన ప్రసంగాన్ని అందించారు. ఈ సందర్భంగా శ్రీ కృష్ణ మాట్లాడుతూ కమ్యూనికేషన్, రవాణా నుండి ఆరోగ్య సంరక్షణ మరియు కనెక్టివిటీ వరకు, సాంకేతికత మన జీవితాలను మెరుగుపరుస్తుందని ఆయన అన్నారు. టెక్నాలజీ  మనందరి  జీవితాన్ని ఏదో ఒక విధంగా ప్రభావితం చేస్తుందని, సాంకేతికత లేకుండా జీవితం అసాధ్యం అని ఆయన తెలిపారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ సాంకేతికతపైనే ఆధారపడి ఉంటారని, సాంకేతికత అభివృద్ధితో పాటు ప్రజల అవసరాలు కూడా అభివృద్ధి చెందాయని శ్రీ కృష్ణ తెలిపారు.

సీనియర్ డైరెక్టర్, కాగ్నిజెంట్ రామకృష్ణ ములుకుట్ల గౌరవ అతిథిగా ప్రసంగించారు. రామకృష్ణ మాట్లాడుతూ ఈ పోటీ యుగంలో ప్రతి  విద్యార్థి క్రిటికల్ థింకింగ్, సమస్య పరిష్కారంలో నేర్పరితనం కావాలని, స్మార్ట్ థింకింగ్ , చురుకుదనం, వ్యవస్థాపకత, రాతపూర్వక కమ్యూనికేషన్  సమాచారాన్ని యాక్సెస్ చేయడం, విశ్లేషించడం అనే అంశాలు చాల ముఖ్యమైనవని ఆయన వివరించారు. ప్రిన్సిపాల్ పి రవీందర్ రెడ్డి కళాశాల గురించి, సుధీ 2023 ఛైర్‌పర్సన్ వివిధ విభాగాల  ప్రోగ్రామ్‌ల గురించి, ధీరజ్  కృతజ్ఞతలు తెలపటం ద్వారా ప్రారంభ కార్యక్రమం ముగిసింది.

ఆ తరువాత కెమికల్ ఇంజనీరింగ్ విభాగం లో ముఖ్య ప్రసంగం జరిగింది.  ఈ కార్యక్రమంనికి  ముఖ్య ఉపన్యాసకులు మిక్కిలినేని అక్కయ్య చౌదరి, రిటైర్డ్ జనరల్ మేనేజర్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (రిఫైనరీస్ విభాగం) విచ్చేసి ప్రాసెస్ పరిశ్రమలలో శక్తి దృశ్యం, స్థిరమైన అభివృద్ధి అవలోకనం అనే అంశం మీద ప్రగించారు. ఆదే సమయం లో బయో టెక్నాలజీ విభాగం లో  డాక్టర్ మోహన కృష్ణ గుండాల , కే ఎల్ ఈ  సాంకేతిక విశ్వవిద్యాలయం , హుబ్బల్లి, కర్ణాటక విచ్చేసి “బయోఎకెక్ట్రికల్ సిస్టమ్స్: విలువ జోడింపు మరియు పర్యావరణ తగ్గింపు కోసం బహుముఖ ప్రక్రియ” అనే అంశం మీద ప్రసంగించారు.

ఆదే సమయం లో  ఈ సి ఈ  విభాగం లో సేనాప్స్ అనే కార్యక్రమం లో ఎన్  శారద,సైంటిస్ట్ – జి , డిఎల్ఆర్ఎల్ , హైదరాబాద్, ముఖ్య అతిధి గా విచ్చేసి నిన్న, నేడు, మరియు రేపటి ఎలక్ట్రానిక్ ,ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్స్, రాడార్ గురించి అవగాహన కల్పించారు. ఈబ్లు లో కృత్రిమ మేధస్సు పాత్ర అనే అంశల  మీద ప్రసంగించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా నిర్వహించిన కార్యక్రమం లో  ప్రముఖ పరిశ్రమ వ్యక్తి మిస్టర్ రాయదాస్  మంతెన-వైస్ ప్రెసిడెంట్, జెపి మోర్గాన్ చేజ్ బోస్టన్, యూఎస్ఎ  “ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఐటి -గ్లోబల్ అవకాశాలలో ట్రెండ్‌లు” అనే అంశం మీద మాట్లాడారు. ఈఈఈ విభాగం ఎలెక్ట్రిక్ట్  అనే కార్యక్రమం నిర్వహించారు. పరిశ్రమలలోని వ్యర్థ జలాల శుద్ధి ప్లాంట్ల గురించి హెచ్‌ఎండబ్ల్యూఎస్ డిప్యూటీ జనరల్ మేనేజర్ అంబటి నరహరి మాట్లాడారు.

అదే సమయంలో, ఎం సి ఎ  విభాగంలో వివిధ పేపర్ మరియు పోస్టర్ ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా ఎం జి ఐ టి  నుండి శ్రీ లత, వాసవి ఇంజనీరింగ్ కళాశాల నుండి డాక్టర్ జితేందర్ రెడ్డి హాజరయ్యారు.

Related posts

పాక్ వెర్డిక్ట్:టెర్రరిస్టు హఫీజ్ సయీద్ కు జైలు శిక్ష

Satyam NEWS

అదనపు కలెక్టర్ గా అభిలాష బాధ్యతలు

Bhavani

నాన్న అన్న పిలుపు

Satyam NEWS

Leave a Comment