39.2 C
Hyderabad
May 3, 2024 12: 50 PM
Slider కవి ప్రపంచం

నాన్న అన్న పిలుపు

#M Anasuya

నాన్న అన్న నా పిలుపుకై

నీవెంత ఎదురుచూస్తుంటావో

నాన్న అన్న ప్రతిసారి నీ మోమున

ఎగజిమ్మే ప్రేమ తుంపరలు

నన్ను చల్లగా తాకుతుంటాయి

నేను వేసే ప్రతి తప్పటడుగులో

ఎన్నో మౌలిక విలువలు నేర్పిన ఆదర్శానివి

బంతితో ఆటలు నేర్పుతూ

భద్రత ఏంటో నేర్పిన స్నేహానివి

నా కేరింతల్లో నీ ఆనందం ఏకమై

నా చదువులో నీ ఆరాటం తోడై

నిన్న నీవు నీ గురించిన ఆరోగ్యం

పక్కన పెట్టి నాకై కాలాన్ని వెచ్చించావు

నా ధైర్యం నీవై కొండలా నిలిచావు

నాభద్రత నీవై ఆకాశమయ్యావు

నా భరోసా నీవై విశ్వాసాన్ని నింపావు

నాన్న నీ కోసం నీవుగాక

నా కోసమే నీ జీవితమన్నట్లుగా

సాగిపోయావు నా జీవిత పునాదికై

నీ త్యాగాల ఫలితమే నా ఈ భవిష్యత్తు

నా అవసరాలే నీ అవసరాలుగా

శ్రమపడిన ప్రతి నీ రక్తపు బొట్టు

నాకై వెచ్చించిన నీ జీవితంలో

నీ మలిదశలో నేను సైతం

నేను నీకు తండ్రినై

నీకూ భరోసానౌతా

నీకూ భద్రతనౌతా

నీకూ ధైర్యాన్నౌవుతా నీ ప్రేమలో జన్మ జన్మలకు

యం.అనసూయ, సైదాబాద్, హైదరాబాద్

Related posts

గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

Satyam NEWS

కర్నూలు ఎస్ పిగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ్ కౌశల్

Satyam NEWS

భవిష్యత్తు తరాల కోసం వైఎస్ షర్మిల కు అండగా ఉందాం

Satyam NEWS

Leave a Comment