తన భార్యకు మరో వివాహాన్ని జరిపించి, ఆమె సంతోషంగా ఉండేలా చూడాలని తండ్రిని ఉద్దేశించి ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఓ బ్యాంకు అధికారి ఆత్మహత్య యత్నం చేస్తూ రాసిన ఒక లేక సంచలనం సృష్టించింది. పోలీసులు కతనం ప్రకారం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ హెచ్డీఎఫ్సీ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్ గా పనిచేస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన చిత్తలూరి శ్రవణ్ కుమార్ ఆర్థిక సమస్యలు ఉన్నాయి.
ఇతనికి 2019లో సూర్యాపేటకు చెందిన హరిత అనే యువతితో వివాహం జరిగింది. దంపతులు ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. బాకీలతో మానసికంగా కుంగిపోయిన అతను, పురుగుల మందు తాగగా, దీన్ని గమనించిన హారతి, అతడిని ఆసుపత్రికి తరలించింది. శ్రవణ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో, వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.