26.1 C
Hyderabad
May 15, 2021 04: 20 AM
Slider సంపాదకీయం

బెనిఫిట్… బెనిఫిట్… బెనిఫిట్: వెన్నెముక లేని పెద్ద హీరోలు

#TeluguFilmHeros

వకీల్ సాబ్ బాగుంది….సూపర్… బంపర్ హిట్టు…. అంటూ కామెంట్లు పెట్టడం తప్ప ఆ సినిమా ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర నష్టాల్లోకి వెళ్లే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే పెద్ద హీరోలు ఎవరూ మాట్లాడటం లేదు.

హీరో పవన్ కల్యాణ్ తో రాజకీయంగా ఉండే విభేదాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వం తీవ్ర అడ్డంకులు సృష్టించిన విషయం తెలిసిందే. పెద్ద హీరోల చిత్రాలను బెనిఫిట్ షో వేయడం ఆనవాయితీగా వస్తున్నది.

అభిమానుల కోసం ప్రత్యేకంగా టిక్కెట్లు ప్రీమియం ధరలకు అమ్మి ప్రత్యేక షోలు ప్రదర్శించడం కూడా చేస్తున్నారు.

అంతే కాకుండా డైనమిక్ ప్రయిసింగ్ సిస్టం తో డిమాండ్ ను బట్టి మొదటి మూడు రోజులో లేక ఇంకా డిమాండ్ వుంటే మొదటి వారం రోజులో ఎక్కువ ధరకు టిక్కెట్లు అమ్ముకోవడం కూడా ఆనవాయితీగా వస్తున్నది.

డిమాండ్ లేని సినిమాలకు ఇవేవీ వర్తించవు. ఆ చిత్రాలను మామూలు టిక్కెట్ల ధరలకే ప్రదర్శిస్తున్నారు. ఈ మొత్తం వ్యవస్థను దెబ్బ కొట్టే విధంగా ఏపి ప్రభుత్వం వకీల్ సాబ్ చిత్రం విడుదల సందర్భంగా ప్రవర్తించింది. బెనిఫిట్ షో లను కరోనా కారణం చూపించి అడ్డుకున్నారు.

అదే విధంగా సామాన్యులకు భారం పడుతుందని చెబుతూ అభిమానులకు ప్రత్యేక షో వేసే విధానాన్ని కూడా అడ్డుకున్నారు. అభిమానులకు వేసే ప్రత్యేక షో టిక్కెట్లు ఎక్కువ ధరకు అమ్మితే సాధారణ ప్రజలకు ఏ విధంగా భారం అవుతుందో తెలియదు.

కానీ సామాన్యులపై టిక్కెట్ భారం పడకుండా ప్రభుత్వం అడ్డుకుంటున్నదని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేశారు.

పరోక్షంగా పవన్ కల్యాణ్ పై విషం

పెద్ద హీరోల కారణంగా ఇలా జరుగుతున్నదని పరోక్షంగా పవన్ కల్యాణ్ పై విషం చల్లారు. ఈ విధంగా సినిమాను రాజకీయాల కోణంలో చూస్తుంటే ఏ హీరో కూడా అదేమని ప్రశ్నించలేదు.

నేడు పవన్ కల్యాణ్ హీరోగా ఉన్న సినిమాకు ఇలా జరిగింది భవిష్యత్తులో (రాజకీయంగా తమకు వ్యతిరేకులైన) వేరే హీరోకు జరగదని గ్యారెంటీ ఉందా?

రంగ్ దే సినిమాకు కొద్ది రోజుల కిందట బెనిఫిట్ షో లకు అనుమతించిన ప్రభుత్వం పవన్ కల్యాణ్ సినిమాకు అడ్డుతగిలితే అదేమని మిగిలిన హీరోలు ప్రశ్నించకపోవడం సమంజసమా? అని సినీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రతి సారీ ధన్యవాదాలు చెప్పే చిరంజీవి నుంచి వేరే హీరోలు ఎవరూ కూడా టిక్కెట్ ధరలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.

తెలుగుదేశం పార్టీలో ఉన్న బాలకృష్ణ, తెలుగుదేశం పార్టీ  ఎంపి బావమరిది అయిన మహేష్ బాబు ఇలా వేరే పార్టీలకు మద్దతు ఇచ్చే వారికి రాబోయే రోజుల్లో ఇదే విధంగా ప్రభుత్వం అడ్డుతగిలితే పరిస్థితి ఏమిటి?

సినిమాను విడుదల చేసి వంద రోజులు ఆడించి లాభాలు తీసుకునే రోజులు ప్రస్తుతం లేవు.

సినిమా విడుదల అయిన గంటలో పైరసీ ఆన్ లైన్ లో వచ్చేస్తున్నది. పైరసీ కాపీ వచ్చిన తర్వాత సినిమాకు డిమాండ్ పడిపోతున్నది.

ఇలా పైరసీ నుంచి సినిమాను కాపాడుకోవడానికి బెనిఫిట్ షోలు, అభిమానులకు ప్రత్యేక షోల పేరుతో కలెక్షన్లు రాబడుతున్నారు. సినిమా నిత్యావసర వస్తువు కాదు. సామాన్యుడికి కూడా అందుబాటులో ఉంచేందుకు.

సామాన్యుడికి కావాల్సిన ‘‘మందు’’ పై వ్యాపారం చేసే ప్రభుత్వాలు పెద్ద హీరో సినిమా బెనిఫిట్ షో రేట్ల గురించి ఆందోళన చెందడం హాస్యాస్పదం.

Related posts

పల్స్ పోలియో కార్యక్రమంలో పిల్లల నోట్లో శానిటైజర్

Satyam NEWS

కరోనాతో మంట కలిసిన మానవత్వం

Satyam NEWS

షెడ్డు పనులను పరిశీలించిన ఎంపీడీవో

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!