32.2 C
Hyderabad
May 13, 2024 19: 29 PM
Slider ప్రత్యేకం

సుప్రీం ఆర్డర్: రాజ్యాంగ వ్యవస్థలతో గేమ్స్ ఆడవద్దు

#Y S Jaganmohan Reddy

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్. రమేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. స్టే ఇచ్చేందుకు నిరాకరించడమే కాకుండా రాజ్యాంగ సంస్థలతో గేమ్స్ ఆడవద్దని తీవ్ర హెచ్చరిక జారీ చేసింది.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహారంపై సుప్రీం కోర్టులో నేడు విచారణ జరిగింది. రమేశ్ కుమార్‌ను కమిషనర్‌గా కొనసాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ బోబ్డే, న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హృషీకేశ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

ఈ సందర్భంగా జగన్ సర్కార్‌పై ధర్మాసనం తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసింది. ప్రతివాదులకు రెండు వారాల్లో నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. స్టే ఇవ్వడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.

Related posts

శరవేగంగా కర్రి బాలాజీ “బ్యాక్ డోర్” మూవీ

Satyam NEWS

ఆ కిరాతకులు లారీ డ్రైవర్ క్లీనర్ మరో ఇద్దరు

Satyam NEWS

వనపర్తిలో పత్రికల ప్రభావం పని చేయదు

Satyam NEWS

Leave a Comment