29.7 C
Hyderabad
May 4, 2024 03: 59 AM
Slider ముఖ్యంశాలు

కోవిడ్ నిబంధనలు సచివాలయానికి వర్తించవా?

#AP Secretariat

కరోనా కట్టడి కోసం కచ్చితంగా అమలు చేస్తున్న రెడ్ జోన్, కంటైన్మెంట్ జోన్ లాంటి నిబంధనలు సచివాలయానికి వర్తించవా? ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని చూస్తే అక్కడ కరోనా కట్టడి నిబంధనలు ఉండవనే అనిపిస్తున్నది. తెలంగాణ సచివాలయంలో ఒక ఉద్యోగి మర్కజ్ వెళ్లి వచ్చాడు.

అది తెలియడంతోనే సెక్రటేరియేట్ మొత్తం బ్లాక్ చేసేశారు. శానిటైజేషన్ చేసి సంబంధిత వ్యక్తులకు కరోనా టెస్టులు చేసి, సంబంధిత సెక్షన్ ఉద్యోగులను హోం క్వారంటైన్ కు పంపారు. అయితే ఆంధ్రా సచివాలయంలో మాత్రం సిబ్బందికి కరోనా సోకినా ఏ మాత్రం నివారణ చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

సచివాలయ ఉద్యోగులు మొత్తం 250 మంది హైదరాబాద్ నుంచి బుధవారం నాడు ప్రత్యేక బస్సులో అమరావతికి వచ్చారు. వీరందరికి పి కె కన్వెన్షన్ లో కరోనా టెస్టు నిర్వహించారు. వారంతా క్వారంటైన్ లో ఉన్నారు. క్వారంటైన్ కోసం వారిని నవులూరులోని ఒక అపార్ట్ మెంట్ లో ఉంచారు.

వ్యవసాయ శాఖ కు చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయిది. అతనితో బాటు అతని అపార్ట్ మెంట్ లో ఉన్నవారు గురువారం, శుక్రవారం సచివాలయానికి వచ్చారు. అక్కడ పని చేయడమే కాకుండా మూడో బ్లాక్ లోఉన్న క్యాంటిన్ కు కూడా వెళ్లారు. శనివారం ఆదివారం శెలవు కాగా మూడు నాలుగు బ్లాక్ లలోని ఉద్యోగులను రావద్దని చెప్పాలి కానీ అధికారికంగా ఎవరూ చెప్పలేదు.

సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకుడు వెంకట్ రామిరెడ్డి మూడు నాలుగు బ్లాక్ లో పని చేసేవారు రావద్దని అనధికారికంగా చెప్పారు. నేడు వారెవరూ విధులకు హాజరుకాలేదు కానీ అధికారికంగా జీఏడీ నుంచి ఇప్పటికీ సమాచారం రాలేదు. మూడు నాలుగు బ్లాకుల్లో మొత్తం 12 మంది మంత్రులు ఉంటారు.

నిబంధనల ప్రకారం సచివాలయం మొత్తం రెడ్ జోన్ గా ప్రకటించాలి. అయితే బ్లాక్ లు దూరంగా ఉంటాయి కాబట్టి కనీసం మూడు నాలుగవ బ్లాక్ అయినా రెడ్ జోన్ గా మార్చి దానిలోకి ఎవరూ వెళ్లకుండా చూడాలి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అలాంటివేం చేయాలేదు.

మూడవ, నాలుగవ బ్లాక్ క్యాంటిన్ లను శానిటైజ్ చేశారు తప్ప అధికారికంగా ఎవరికి రావద్దని సమాచారం ఇవ్వలేదు. దాంతో సచివాలయం సిబ్బంది భయం భయంగా బతుకుతున్నారు.

Related posts

స్పీడ్ గన్ తో ఫొటోలు తీస్తున్న కానిస్టేబుల్ ను అడ్డుకున్న వ్యక్తిపై క్రిమినల్ కేసు

Satyam NEWS

సీఎం జగన్ తన పథకాలతో పేద ప్రజల గుండెల్లో చిరస్థానం

Bhavani

ట్రాజెడీ: గ్రామం మొత్తానికి ఫుడ్ పాయిజనింగ్

Satyam NEWS

Leave a Comment