29.7 C
Hyderabad
May 4, 2024 05: 24 AM
Slider ఆధ్యాత్మికం

శ్రీ సౌమ్యనాధ స్వామి బ్రహ్మోత్సవాలల్లో ధ్వజారోహణం

#swamyanathaswamy

కడప జిల్లా నందలూరు లోని ప్రసిద్ద శ్రీ సౌమ్యనాధ స్వామి బ్రహ్మోత్సవాలల్లో బాగంగా శనివారం ధ్వజారోహణంతో వేద పండితులు ముక్కోటి దేవతలను ధ్వజ పటం ఎగురవేసి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు.

మంగళ వాయిద్యాలు వేదమంత్రాల నడుమ వేడుకగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ బ్రహ్మోత్సవాల కమిటీ మేడా భాస్కర్ రెడ్డి,మేడా విజయ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వైఖానుస ఆగమ శాస్త్రం ప్రకారం ధ్వజారోహణం నిర్వహించారు. విశ్వసేనుని పూజా, పుణ్యా అవాచనం,గరుడ ప్రతిష్ట,అగ్ని ప్రతిష్ట,సర్వ దేవతా ఆహ్వానం అభిషేకం,హారతి శాస్త్రోక్తంగా నిర్వహించారు.

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు పాల్గొనగా, పాల్గొన్న భక్తులకు తీర్థ, అన్న ప్రసాదాలు అందించారు.ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు వేసారు.అలయంను పరిసర ప్రాంతాల్లో రంగు రంగుల లైటింగ్ బోర్డులను ఏర్పాటు చేశారు.

Related posts

ఇంద్ర‌కీలాద్రిపై గాయ‌త్రీదేవిగా దుర్గ‌మ్మ

Satyam NEWS

కాశ్మీర్ లో భారత్ తీసుకునే చర్యలకు పాక్ అభ్యంతరం

Satyam NEWS

ప(ప్ల)వనం

Satyam NEWS

Leave a Comment