38.2 C
Hyderabad
April 29, 2024 19: 40 PM
Slider ప్రపంచం

కాశ్మీర్ లో భారత్ తీసుకునే చర్యలకు పాక్ అభ్యంతరం

#ImranKhan

జమ్మూ కాశ్మీర్ లో భారత ప్రభుత్వం తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాల కారణంగా ఈ ప్రాంతంలో అశాంతి ప్రబలుతోందని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు.

ఏకపక్షంగా భారత్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కాశ్మీర్ లో శాంతి లేకుండా పోతున్నదని ఆయన అన్నారు. షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ (ఎస్ సి ఓ) దేశాల అధిపతుల సమావేశంలో ఆయన వీడియో లింక్ ద్వారా పాల్గొన్నారు.

ఎస్ సి ఓ లో పాకిస్తాన్ తో బాటు చైనా, రష్యా, ఇండియా, కజకస్తాన్, కైర్గజిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ లు సభ్యులుగా ఉన్నాయి. శాంతి సుస్థిరత కోసం పాటుపడాలనే ఐక్యరాజ్య సమితి తీర్మానానికి తాము కట్టుబడి ఉన్నామని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.

అయితే భారత్ చర్యలు అస్థిరత్వానికి దారితీస్తున్నాయని ఆయన అన్నారు. పాకిస్తాన్ లో కరోనా కట్టడికి చైనా అందించిన సాయం మరువలేనిదని ఆయన తెలిపారు.

ఆఫ్ఘనిస్థాన్ లో శాంతి ప్రక్రియ కొనసాగాలని, దాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్న శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

Related posts

40 ఏళ్లు కష్టపడ్డ చిన్నారెడ్డికి కాకుండా 40 రోజుల కింద చేరిన వారికి టికెట్టా?

Satyam NEWS

చెత్త పన్ను రద్దు పై ప్రజానీకం పోరాటాలకు సిద్ధం కావాలి

Satyam NEWS

ఎన్డీయే సర్కార్ పై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మాణం

Bhavani

Leave a Comment