38.2 C
Hyderabad
April 27, 2024 17: 13 PM
Slider ముఖ్యంశాలు

పార్ట్ టైం టీచర్స్ యం.టి.యస్ కు ముఖ్యమంత్రి జగన్ అంగీకారం

#y j jaganmohan reddy

మినిమం టైమ్ స్కేల్ జాబితాలో పార్ట్ టైమ్ టీచర్లను చేర్చేందుకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అంగీకరించారని పార్ట్ టైం టీచర్స్ కడప జిల్లా అధ్యక్షుడు యం.చంద్ర శేఖర్ తెలిపారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు యం.చంద్ర శేఖర్ వినతి పత్రం అందజేశారు.

పార్ట్ టైం టీచర్స్ సమస్యలపై వినతి పత్రం సమర్పించగానే ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. పార్ట్ టైం టీచర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ తరపున రెగ్యులరైజేషన్ మరియు మినిమం టైమ్ స్కెలింగ్ గురించి వినతిపత్రంలో పేర్కొనగా ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారని చంద్రశేఖర్ తెలిపారు. ముఖ్యమంత్రి రెగ్యులర్ గురించి ప్రస్తావిస్తూ తప్పకుండా చేద్దామని భరోసా ఇచ్చారని ఆయన తెలిపారు.

జీతాల పెంపు విషయంలో ముఖ్యమంత్రి పి.యస్ ధనుంజయరెడ్డి ని పిలిచి ఆర్ట్. క్రాఫ్ట్ .పి.యి.టి పార్ట్ టైం టీచర్స్ కి మినిమం టైమ్ స్కెల్ ఇవ్వడం లేదా ఎందుకు జీతం తక్కువగా ఉంది అని అడిగారని చంద్రశేఖర్ తెలిపారు.

అందుకు ధనుంజయరెడ్డి మాట్లాడుతూ యం.టి.యస్ జాబితాలో వీరు లేరు అని తెలియజేయగా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటనే వీరికి MTS అమలు చేసి జీతాలు పెంపు చేయాలని ఆదేశించారని చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్ర కమిటీ తరపున తమ సమస్యలపై స్పందించిన సి.యం జగన్మోహన్ రెడ్డి కి పార్ట్ టైం టీచర్స్ ధన్యవాదాలు తెలియజేశారు.

Related posts

అవినీతిలో కూరుకుపోయిన వైసీపీ ప్రభుత్వం

Satyam NEWS

నాగర్ కర్నూల్ జిల్లా సాహిత్యంపై నారాయణకు పిహెచ్ డి

Satyam NEWS

ఘనంగా సబ్ రిజిస్ట్రార్ తస్లీమా పుట్టిన రోజు

Satyam NEWS

2 comments

Torlapati Ramesh July 17, 2021 at 10:34 PM

Thank you very much CM sir
మా కల కలగా కాకుండా నిజం చేసినందుకు,

Reply
Satyam NEWS August 8, 2021 at 11:23 AM

thank you

Reply

Leave a Comment