29.7 C
Hyderabad
May 3, 2024 06: 20 AM
Slider ప్రపంచం

Another controversy: భారత్ వ్యతిరేకి అయిన బ్రిటన్ నేతతో రాహుల్ భేటీ

#rahulgandhi

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మరో వివాదాస్పద పని చేశారు. తరచూ భారత్ పై వ్యతిరేక వ్యాఖ్యలు చేసే బ్రిటన్ ఎంపీ జెరెమీ కార్బిన్‌ను నేడు ఆయన లండన్ లో కలిశారు. ఈ సమావేశానికి సంబంధించిన చిత్రాన్ని కాంగ్రెస్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. ఇప్పుడు వీరి భేటీపై వివాదం నెలకొంది.

లండన్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లండన్ లో శామ్ పిట్రోడాతో కలిసి వెళ్లి బ్రిటన్ ఎంపీ జెరెమీ కార్బిన్‌తో సమావేశం అయ్యారు. బ్రిటన్ ప్రతిపక్ష నాయకుడు జెరెమీ కార్బిన్‌ “భారత వ్యతిరేక” అభిప్రాయాలను రాహుల్ గాంధీ సమర్థిస్తున్నారా అని బిజెపి ఈ సందర్భంగా  ప్రశ్నించింది.

2015 నుండి 2020 వరకు లేబర్ పార్టీ నాయకుడిగా మరియు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన జెరెమీ కార్బిన్, భారతదేశానికి వ్యతిరేకంగా చాలాసార్లు ప్రకటనలు చేశారు. అంతే కాకుండా జెరెమీ కార్బిన్ తన హిందూ వ్యతిరేక వైఖరిని పలుసార్లు వ్యక్తం చేసి అపఖ్యాతి పాలయ్యాడు.

భారతదేశం నుండి కాశ్మీర్‌ను విడదీయాలని బహిరంగంగా సమర్ధించడంలో ఆయన ముందుంటారు. అలాంటి వ్యక్తితో రాహుల్‌ భేటీపై పలువురు బీజేపీ నేతలు ప్రశ్నలు సంధించారు. బీజేపీ నేత, న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు ట్విటర్‌లో రాహుల్ గాంధీ ఆయనను కలిసిన చిత్రాన్ని పంచుకోవడం ద్వారా కాంగ్రెస్ తన దేశ వ్యతిరేక విధానాలను వెల్లడిస్తున్నదని అన్నారు.

‘మళ్లీ.. కశ్మీర్‌ విభజనను సమర్థిస్తూ భారత్‌పై ద్వేషం, అసహ్యంతో ప్రఖ్యాతి గాంచిన యూకే ఎంపీ, లేబర్‌ పార్టీ నేత జెరెమీ కార్బిన్‌ను రాహుల్ గాంధీ కలిశారు’’ అని రిజిజు మరో ట్వీట్‌లో వెల్లడించారు. లండన్‌లో జెరెమీ కార్బిన్‌తో రాహుల్ గాంధీ ఏమి చేస్తున్నారు అని బీజేపీ నేత కపిల్ మిశ్రా ట్వీట్ చేశారు.

జెరెమీ కార్బిన్ భారత్ నుంచి కాశ్మీర్‌ను విడదీయాలని బహిరంగంగా వాదిస్తున్నారని ఆయన అన్నారు. బీజేపీ నేతల ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా స్పందించారు. పిఎం మోడీతో జెరెమీ కార్బిన్ ఫోటోను ఆయన ట్విట్ చేస్తూ ‘చివరిగా, దిగువ చిత్రంలో ఉన్న ఇద్దరిని గుర్తించి, అదే ప్రశ్న అడగమని నేను నా మీడియా స్నేహితులను అడగవచ్చా? అని కామెంట్ చేశారు.

భారతదేశంపై జెరెమీ కార్బిన్ అభిప్రాయాలను ప్రధాని ఆమోదించారని దీని అర్థమా అని ఆయన ప్రశ్నించారు. దేశం వదిలి పారిపోయిన నీరవ్ మోదీ మరియు మెహుల్ చోక్సీలతో ప్రధాని మోదీ బహిరంగంగా సంభాషించిన సందర్భాలను కూడా ఆయన ఉదహరించారు.

ప్రధానమంత్రి వీరందరికి మద్దతు ఇస్తున్నారా అని అడిగారు. చైనా మన భూభాగాన్ని ఆక్రమించుకున్నప్పుడు, ప్రధాని ప్రెసిడెంట్ జీ జిన్‌పింగ్‌ను మోడీ ఎందుకు కలిశారని కాంగ్రెస్ నాయకుడు అన్నారు. అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్‌ను కలవడానికి ప్రధాని ఎందుకు పాకిస్థాన్ వెళ్లారు? మనకంటే భిన్నమైన అభిప్రాయాలు ఉన్న వారిని ఎప్పటికీ కలవబోమని ప్రభుత్వం హామీ ఇస్తుందా? ఈ సమయంలో బీజేపీ దుష్ప్రచారంపై కాకుండా వాస్తవ అంశాలపై చర్చ జరగాలన్నారు.

Related posts

చిన్న తిరుపతి వేంకటేశ్వరస్వామి ఆదాయం కోటిన్నర

Satyam NEWS

త్వరలో భారత్ లో పర్యటిస్తా

Satyam NEWS

టీడీపీ నుంచి వచ్చారు టీడీపీ లో చేరారు….

Satyam NEWS

Leave a Comment