42.2 C
Hyderabad
April 26, 2024 16: 31 PM
Slider మెదక్

ఎరువుల షాపులపై వ్యవసాయ అధికారులు దాడులు

#Fertilaizer Shop

నకిలీ విత్తనాలు నకిలీ పురుగుల మందులు అమ్మే వారిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరించారు. పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్ ఆధ్వర్యంలో సిద్దిపేట డివిజన్ లో ఉన్న 45 సీడ్స్ ఫర్టిలైజర్ షాపులలో నేడు పోలీస్ అధికారులు, వ్యవసాయ అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు.

క్రాంతి స్వీట్ సీడ్స్ & ఫర్టిలైజర్ షాప్ లో కాలం చెల్లిన 5 పత్తి ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని  షాపు యజమాని మడురి  ప్రభాకర్ పై కేసు నమోదు చేశారు. ఏసీపీ రామేశ్వర్ షాపు యజమానులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరు స్టాక్ రిజిస్టర్  సక్రమంగా మెయింటైన్ చేయాలని సూచించారు.

ఆరుగాలం కష్టపడి రైతన్నకు స్వచ్ఛమైన  విత్తనాలు పురుగు మందులు అమ్మాలని వారి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పాటుపడాలని సూచించారు. వర్షాకాలం సీజన్ మొదలవుతున్నందున రైతులు  విత్తనాలు, ఫర్టిలైజర్ కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా సంబంధిత  షాపుల నుండి బిల్ తీసుకోవాలని,  పంటలు పండేంత వరకూ బిల్ జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు.

రైతులు షాపుల్లో విత్తనాలు, పురుగుల మందులు కొనేటప్పుడు తప్పకుండా మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా నకిలీ విత్తనాలు పురుగుల మందులు అమ్ముతున్నారని అనుమానం ఉంటే వెంటనే డయల్ 100 లేదా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ వాట్సాప్ నెంబర్ 7901100100 ఫోన్ చేసి  సమాచారం అందిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ తనిఖీల్లో సిద్దిపేట వన్టౌన్ సీఐ సైదులు, టూ టౌన్ సిఐ పరశురామ్ గౌడ్, సిద్దిపేట రూరల్ సిఐ సురేందర్ రెడ్డి, దుబ్బాక సిఐ హరికృష్ణ గౌడ్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

యాక్షన్: కరోనా క్వారంటైన్ కేంద్రంగా గచ్చిబౌలి స్టేడియం

Satyam NEWS

సూసైడ్:నిందితుడు మారుతీరావు ఆత్మహత్య

Satyam NEWS

చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment