29.7 C
Hyderabad
May 6, 2024 05: 49 AM
Slider సంపాదకీయం

దక్షిణాది రాష్ట్రాలకు తక్లీఫ్ మోసుకొచ్చిన తబ్లిక్ జమాత్

india covid

దేశంలో ఇప్పటి వరకూ సంభవించిన కరోనా మరణాలలో అత్యధికులు ఢిల్లీ యాత్ర చేసి వచ్చిన వారే కావడం ఆశ్చర్యం కలిగించే అంశం. ఇప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాలలో ఢిల్లీ యాత్రకు వెళ్లి వచ్చిన వారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక లాంటి రాష్ట్రాలు రాబోయే రోజుల్లో పెను ప్రమాదాన్ని ఎదుర్కొనాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.

తబ్లిక్ జమాత్ కార్యక్రమానికి వందలాది మంది వివిధ రాష్ట్రాల వారు, విదేశీ ఇస్లామిక్ బోధకులు హాజరయ్యారు. లాక్ డౌన్ ఉండగానే వివిధ వాహనాలలో వీరంతా దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లారు. తెలంగాణలో ఆరు మరణాలు ఒకే సారి ప్రకటించిన రోజునే తమిళనాడు రాష్ట్రంలో 17 పాజిటీవ్ కేసులు వచ్చాయి.

వాటిలో 10 కేసులు కేవలం ఈరోడ్ జిల్లాకు చెందినవి. తెలంగాణ లోని పాత కరీంనగర్ జిల్లా, తమిళనాడులోని ఈరోడ్ జిల్లా ఇస్లాం మత వ్యాప్తికి తబ్లిక్ జమాత్ ఎంచుకున్నది. అందుకే ఈ రెండు ప్రదేశాలకు విదేశీ మత పెద్దలను డెప్యూట్ చేశారు.

ఇండోనేసియాకు చెందిన వారు కరీంనగర్ కు రాగా  థాయ్‌లాండ్ కు చెందిన వారు ఈరోడ్ కు వెళ్లారు. తమిళనాడు నుండి 1,500 మంది తబ్లీక్ జమాత్ కు వెళ్లారు. మత పెద్దలను వెంటబెట్టుకుని వారు తిరిగి వచ్చారు. కరీంనగర్ లో జరిగింది కూడా ఇదే. తమిళనాడు, తెలంగాణలో మాత్రమే కాదు ఢిల్లీలో సంభవించిన మరణాలన్నీ కూడా తబ్లీక్ జమాత్ కు వెళ్లి వచ్చిన వారే.

తబ్లిక్ జమాత్ సంస్థ ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేసే ప్రధాన ఉద్దేశ్యంతో నడిపే ధార్మిక సంస్థ. ముస్లిం మతంపై విశ్వాసాన్ని పునరుద్ధరించడం ఈ సంస్థ ప్రదాన ఉద్దేశ్యం. ఇస్లామిక్ విశ్వాసం గురించి చెప్పి అందరూ ఆ మత విశ్వాసాలను అనుసరించే విధంగా చేయడం ఈ సంస్థ ప్రధాన కర్తవ్యం.

ఢిల్లీలో దఫ దఫాలుగా జరిగి ఈ సమావేశాలకు ఇండోనేషియా, థాయిలాండ్, కిర్గిజస్థాన్ నుండి దాదాపు 50 మంది బోధకులు వచ్చారు. తమిళనాడులోని కాంచీపురం, తంజావూరు వీరి తదుపరి టార్గెట్లు. జమాత్ సమావేశానికి జిల్లాకు చెందిన 33 మంది హాజరైనట్లు ఈరోడ్ జిల్లా కలెక్టర్ సి కతిరవన్ తెలిపారు.

పెరుండురైలోని ఐఆర్టి మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఇప్పుడు చికిత్స పొందుతున్న 19 మంది వ్యక్తులు థాయ్ జాతీయులైన 5 గురు ఇస్లాం మత పెద్దలే. కోయంబత్తూర్, మదురై, సేలం వరకు కూడా ఈ మత పెద్దలు వెళ్లి వచ్చారు. ఇప్పటికే కోయంబత్తూరులో ఐదుగురికి కోవిడ్ 19 పాజిటీవ్ వచ్చింది. మదురైలో ఇటీవల మరణించిన 54 ఏళ్ల వ్యక్తి కూడా ఢిల్లీ వెళ్లి వచ్చిన వాడే. కరీంనగర్ తో బాటు సేలం ప్రాంతానికి ఇండోనేషియా జాతీయులు వెళ్లినట్లు పోలీసు వర్గాలు ఇప్పుడు కనుక్కున్నాయి.  కర్నాటక లోని తుమకూరు లో మరణించిన 65 ఏళ్ల వ్యక్తి కూడా ఢిల్లీ యాత్రీకుడే.

Related posts

ఒకేరోజు 5.60 లక్షల మొక్కలు

Bhavani

ఆర్మ్ రిజర్వు పోలీసుల కోసం “డీ-మొబిలైజేషన్”

Satyam NEWS

కాకతీయ యూనివర్సిటీలో స్పోర్ట్స్ డైరెక్టర్ దురుసు ప్రవర్తన

Satyam NEWS

Leave a Comment