40.2 C
Hyderabad
April 29, 2024 18: 49 PM
Slider మహబూబ్ నగర్

కిక్కే కిక్కు: యథేచ్ఛగా పెరుగుతున్న బెల్టుషాపులు

wines shop

అసలే కరోనా వైరస్ వ్యాధి నుండి ప్రజలు  భయాందోళనకు గురవుతున్నారు. అలాంటి సమయంలో  కాలనీలకు కొత్తవారు వస్తే ఎలా ఉంటుంది? వారి నుంచి ప్రజలు ఎంత భయపడతారు? ఒకవైపు కరోనా  వైరస్ వ్యాధి వ్యాపించకుండా అందరూ ఇళ్లలో ఉండండి  అంటూ  ప్రభుత్వం లాక్ డౌన్ ను విధించింది.

కొందరు బ్లాక్ దందాగాళ్లు ఇష్టానుసారంగా లిక్కర్ అమ్ముతున్నారు. దాంతో కొత్త ముఖాలు కాలనిలో కనిపిస్తున్నాయి. ఎవరికి ఎలాంటి వ్యాధులు ఉన్నాయో అని కాలనీ ప్రజలు భయాందోళనకు గురి అవుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెల్ట్ షాపులు మాత్రం ప్రభుత్వ ఆదేశాలను ఏమాత్రం లెక్క చేయకుండా యధేచ్ఛగా ఒక క్వార్టర్, బీర్ బాటిల్ పై అదనంగా రెండు వందలు ఫుల్ పై ఎనిమిది వందలు రూపాయలు లాభాలు పొందుతున్నారు.

ఇవి ఎవరెవరికి ముడుతున్నాయో తెలియదు ఇదంతా కొల్లాపూర్ మున్సిపాల్ పరిధిలో జరుగుతుంది. పట్టణంలో అన్ని శాఖ అధికారులు ఉన్నా బెల్ట్ షాపులు నడుస్తున్నాయి అంటే వారి ధైర్యం ఏమిటో తెలియడం లేదు. ప్రభుత్వ ఆదేశాలను లెక్క చేసుకుండా దందాను కొనసాగిస్తున్నారు.

కొందరు టీఆర్ఎస్ పార్టీ కి చెందిన వ్యక్తులు దందా చేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో వైన్స్ బంద్ వున్నాయి. బెల్ట్ షాపులకు మందు ఎలా వస్తుంది అనుకుంటున్నారా? ఇక్కడనే ఉంది మతలాబ్. కొందరు వైన్స్ షాపు నుండి స్టాక్ ను బయటకి తెచ్చి బెల్ట్ షాపు లకు రాత్రి వేళల్లో సప్లై చేస్తున్నారని  స్థానికులు అంటున్నారు.

పగటి పూట కలెక్షన్ చేసుకుంటున్నారని అంటున్నారు. అధికారులకు సమాచారం ఇస్తే వస్తున్నారు కానీ అమ్మకాలను అడ్డుకోలేక పోతున్నారని అంటున్నారు. ఈ కరోనా వ్యాధి వైరస్ నుండి అన్ని వ్యాపారస్తులు స్వచ్చందంగా షాపులు బందు చేసుకొని వ్యాపారాలు లాస్ అయినా లాక్ డౌన్ పాటిస్తే. బెల్ట్ షాపు వ్యాపారులు మాత్రం మూడు పువ్వులు అరుకాయలుగా సాగుతుందని అంటున్నారు. ఇదంతా ఆ శాఖ అధికారులకు తెలిసే జరుగుతుందని అంటున్నారు. కొందరు సిబ్బంది ఇదే వ్యాపారం చేస్తున్నారని అంటున్నారు. అయితే మందు కోసం ఎక్కడి నుండో కొత్త వస్తున్నారు. వారి నుండి కరోనా వ్యాధి వ్యాపిస్తుందేమోనని ఆయా కాలనీ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఉన్నత అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు అంటున్నారు.

Related posts

సామాజిక సమరభేరికి రాష్ట్ర మంత్రులు.. అందులో ముగ్గురు  డిప్యూటీ సీఎం లు..!

Satyam NEWS

హోమియో చికిత్స: కరోనా ‘ థర్డ్ వేవ్ ‘ థండర్

Satyam NEWS

తిరుమల ఘాట్ రోడ్లపై కనువిందు చేస్తున్న జింకలు

Satyam NEWS

Leave a Comment