38.2 C
Hyderabad
April 29, 2024 12: 16 PM
Slider వరంగల్

కాకతీయ యూనివర్సిటీలో స్పోర్ట్స్ డైరెక్టర్ దురుసు ప్రవర్తన

#KakateeyaUniversity

వరంగల్ లోని చారిత్రక కాకతీయ యూనివర్సిటీ లో మరో వివాదం చోటుచేసుకుంది. గద్వాల్ జిల్లాకు చెందిన గల్లా వెంకటేష్, ఆయన సోదరి కాకతీయ యూనివర్సిటీ లో చదువుతున్నారు.

ఇటీవల జాతీయ స్థాయి యూనివర్సిటీ గేమ్స్ లో పాల్గొన్న వెంకటేష్ సోదరి పట్ల కొందరు సహా విద్యార్థులు అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటన పై వెంకటేష్ కాకతీయ యూనివర్సిటీ స్పోర్ట్స్ డైరెక్టర్ సురేష్ లాల్ కి ఫిర్యాదు చేశారు.

నిన్న స్పోర్ట్స్ విభాగంలో మహిళా విద్యార్థులకు ట్రాక్ షూట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అక్కడకు వెళ్లిన వెంకటేష్ తన సోదరిపై వేధింపులకు పాల్పడిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని డైరెక్టర్ సురేష్ లాల్ ను గట్టిగా నిలదీశాడు.

 అప్పటికే డైరెక్టర్ ఛాంబర్ లో ఉన్న కొందరు నాన్ బోర్డర్స్ వెంకటేష్ పై మూకుమ్మడిగా పిడిగుద్దులతో దాడికి పాల్పడ్డారు.

జరిగిన ఘటన పై బాధితుడు యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. డైరెక్టర్ సురేష్ లాల్ పై చర్యలు తీసుకోవాలని, విధుల నుండి తొలగించాలని విద్యార్థి సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి.

విద్యార్థులు పై బయటి వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన పై విద్యార్థి సంఘాలు ఆగ్రహంతో ఆందోళనకు సిద్ధమవుతుండడం తో కాకతీయ యూనివర్సిటీ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Related posts

గంప, షబ్బీర్ రైతు ద్రోహులు: ఇద్దరి దిష్టిబొమ్మలతో శవయాత్ర

Satyam NEWS

ఘనంగా 76వ స్వాతంత్ర్య దినోత్సవం

Satyam NEWS

వృద్ధాశ్రమంలో LK అద్వానీ జన్మదిన వేడుకలు

Satyam NEWS

Leave a Comment