35.2 C
Hyderabad
May 1, 2024 01: 05 AM
Slider జాతీయం

రాపిడ్ డెకాయిటీ: తమిళనాడు లోనూ కొట్టేశారు

M K Stalin

రాపిడ్ టెస్టింగ్ కిట్స్ వ్యవహారంలో ప్రభుత్వం దాగుడుమూతలు ఆడుతోందని తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు ఎం కె స్టాలిన్ అన్నారు. ఎన్ని కిట్లకు ఆర్డర్ ఇచ్చారో, రేటు ఎంతో చెప్పకుండానే తమిళనాడు ప్రభుత్వం రాపిడ్ టెస్టింగ్ కిట్లకు ఆర్డర్ ఇచ్చేసినట్లు అవి తొలి విడత వచ్చేసినట్లు చెబుతున్నదని ఆయన అన్నారు.

ఛత్తీస్ గఢ్ ఆరోగ్య శాఖ మంత్రి టి ఎస్ సింగ్ దేవ్ ఎంతో పారదర్శకంగా అన్ని విషయాలు వెల్లడిస్తుంటే తమిళనాడులోని ఏఐఏడిఎంకె ప్రభుత్వం మాత్రం ఎంతో గుంభనంగా వ్యవహరిస్తున్నదని ఆయన అన్నారు. 75 వేల రాపిడ్ టెస్టింగ్ కిట్లను రూ.337 ప్లస్ జీఎస్ టి కి కొనుగోలు చేసినట్లు ఛత్తీస్ గఢ్ మంత్రి వెల్లడించారని స్టాలిన్ తెలిపారు.

అయితే తమిళనాడు ప్రభుత్వం మాత్రం భారత్ లో కార్యాలయం ఉన్న దక్షిణ కొరియా కంపెనీ నుంచి ఆర్డర్ ఇచ్చి  కూడా రేటు ఎంతో చెప్పడంలేదని ఆయన అన్నారు. తమిళనాడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లాగానే రాపిడ్ టెస్టు కిట్లను ఎస్‌.డి.బయో సెన్సర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి ఒక్కొక్కటి రూ.600 చొప్పున కొనుగోలు చేసింది. ఆంధ్రప్రదేశ్ రూ.730కి కొనుగోలు చేసింది.

Related posts

వాంటెడ్ జస్టిస్:రఘునందన్ రావు లైంగికదాడి చేసాడు

Satyam NEWS

పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో అక్రమంగా మట్టి తవ్వకాలు

Satyam NEWS

పతాక సన్నివేశాల చిత్రీకరణలో శ్రీరాజ్ బళ్ళా “నరసింహపురం”

Sub Editor

Leave a Comment