Slider కృష్ణ

ఇల్లు గడవక ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోండి

rajendraprasad 201

కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం తోట్లవల్లూరు మండలం పెనమకూరు గ్రామములో ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ పేదలకు నిత్యావసరాలు పంచిపెట్టారు. మండల టీడీపీ అధ్యక్షుడు వీరపనేని శివరాం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముందుగా సర్దార్ గౌతు లచ్చన్న చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించారు.

లాక్ డౌన్ సందర్భంగా ఇబ్బంది పడుతున్న సుమారు 8000 వేల కుటుంబాలకు  నిత్యావసర సరుకులు పంపిణి కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ లచ్చన్న అప్పట్లో  అణగారిన వర్గాల్లో  విద్య బుద్దులు నేర్పి చైతన్యం తీసుకువచ్చారని, రాజకీయంగా కూడా తన గురువు ఎన్.జి  రంగా కోసం తన ఎంపీ పదవిని తృణ ప్రాయంగా వదులుకున్న గొప్ప నాయకుడని అన్నారు.

ఈ రోజుల్లో ఆయన్ని అందరూ ఆదర్శంగా తీసుకొని సమాజం పట్ల బాధ్యతగా మెలగాలని అన్నారు. అలాగే కరోనా కష్ట సమయంలో వల్లూరు మండలం మొత్తం అన్ని గ్రామాలకు ఇంటింటికి సరుకులు పంచుతున్న శివరాం ని అభినందిస్తున్నానని రాజేంద్రప్రసాద్ గారు అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా B.C.సెల్ అధ్యక్షులు వీరంకి గురుమూర్తి,  వల్లూరి కిరణ్  పెనమకూరు తెలుగుదేశం పార్టీ నాయకులు  పాల్గొన్నారు.

Related posts

హుజూర్ నగర్ లో పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

Satyam NEWS

అప్పుల జగన్నాథం బండిని నడిపించగలడా?

Satyam NEWS

ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి

Satyam NEWS

Leave a Comment