29.7 C
Hyderabad
May 4, 2024 06: 55 AM
Slider నెల్లూరు

అక్రమ సంపాదనలో పోటీ పడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు

#TDP Nellore

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలు అభివృద్ధి కార్యక్రమాలు కోసం పోటీ పడేవారని అయితే వైసీపీ పాలనలో ఎమ్మెల్యేలు అక్రమ సంపాదన కోసం పోటీ పడుతున్నారని జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి అన్నారు.

ఈరోజు కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్రమ గ్రావెల్ త్రవ్వకాల విషయములో కోవూరు శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మధ్య వచ్చిన విభేదాలు ఫలితంగా పోలీసు అధికారులు బలి అయ్యారని అన్నారు.

కేసు నమోదు చేసిన పోలీసులపై వేటు వేశారు

గత కొంత కాలంగా గ్రావెల్ త్రవ్వకాల విషయంలో వీరి అనుచరులు మధ్య గ్యాంగ్ వార్లు నడిచాయని అయినా పోలీసు అధికారులు ఏమీ చర్యలు తీసుకోలేకపోయారని ఆయన తెలిపారు. ఎట్టకేలకు పోలీస్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశం తో మే నెల 20 వ తేదీన కొడవలూరు పోలీసు స్టేషన్ లో అక్రమ గ్రావెల్ త్రవ్వకానికి సంబంధించి ప్రసన్నకుమార్ రెడ్డి అనుచరుల పై కేసు నమోదు చేశారని చేజర్ల తెలిపారు.

అయితే తన అనుచరులు పై కేసు నమోదు చేసినందుకు ప్రసన్నకుమార్ రెడ్డి  పట్టు బట్టి కోవూరు CI ని బదిలీ చేయించారాని చేజర్ల వెల్లడించారు. గత సంవత్సర కాలంగా వైసీపీ పాలనలో ప్రసన్నకుమార్ రెడ్డి అండదండలతో కోవూరు నియోజకవర్గం ఇసుక, గ్రావెల్ మద్యం మాపియాల అడ్డాగా తయారయిందని తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాలలో చెప్పినా ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన అన్నారు.

జిల్లా ఎస్పీ స్పందించకపోవడం దురదృష్టకరం

తన ఆదేశాలు తో కేసు నమోదు చేసిన కోవూరు CI ని ఎమ్మెల్యే బదిలీ చేయించుకున్నా జిల్లా ఎస్పీ స్పందించక పోవడం దురదృష్టకరమని చేజర్ల అన్నారు. కోవూరు,కావలి ఎమ్మెల్యేల అక్రమ గ్రావెల్ పంపకాలలో వచ్చిన తేడాతో రెండు నియోజకవర్గాలలో పోలీస్ అధికారులు బలి అయ్యారని ఆయన తెలిపారు.

ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏలూరు కృష్ణయ్య, పెనుమల్లి శ్రీహరి రెడ్డి, దారా విజయబాబు, ఇంటూరు విజయ్, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

ధరణి అంశాల పై కలెక్టర్ లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

Satyam NEWS

రండి సినిమా ధియేటర్లలోనే సినిమా చూద్దాం

Satyam NEWS

పరీక్షలు రాయకుండానే పాస్ చేసిన సీబీఎస్ఈ

Satyam NEWS

Leave a Comment