40.2 C
Hyderabad
May 5, 2024 17: 16 PM
Slider గుంటూరు

ప్రచారంలో ముందున్న…. డాక్టర్ చదలవాడ

#chadalawada

పల్నాడు ప్రాంతంలో రాజకీయ చైతన్యం ఎక్కువ. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో టీడీపీ పార్టీ అసెంబ్లీ నియోజక వర్గ ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు ప్రచారంలో ముందు వరుసలో ఉన్నారు. గత ఎలక్షన్లలో ఆయన టీడీపీ తరఫున పోటీ చేసి ఆయన ఓడిపోయారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన భరోసాతో గత ఐదు సంవత్సరాలుగా నియోజకవర్గ ఇన్చార్జిగా ఉంటూ వైసిపి పార్టీ స్థానిక ఎమ్మెల్యే చేస్తున్న అవినీతి,  అక్రమాలను అడ్డుకుంటూ, వాటిని ప్రజలకు తెలిసేలా ధర్నాలు రాష్ట్రాలు నిరసనలు తెలియజేస్తూ ప్రజలకు దగ్గరయ్యారు.

అధికార పార్టీ ఎమ్మెల్యే అతనిపై కేసులు మోపిన డాక్టర్ చదలవాడ ఏమాత్రం ఖాతరు చేయకుండా ప్రజల పక్షాన పోరాడుతూనే ఉన్నారు. అంతేకాకుండా రాబోయే ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చేపట్టబోయే కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. బాబుతో నేను అనే కార్యక్రమం ద్వారా నరసరావుపేట నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాలలోను , పట్టణంలోని అన్ని వార్డులలో తిరుగుతూ ఉదృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ కరపత్రాలను ప్రజలకు ఇచ్చి, టిడిపి అధికారంలోకి రాగానే చేపట్టిబోయే పథకాల గురించి ప్రజలకు వివరించి చెబుతూ భరోసా కల్పిస్తున్నారు.

అసంతృప్తులను కలుపుకుపోతున్న అరవిందుడు

రానున్న అసెంబ్లీ ఎన్నికలలో నరసరావుపేట సీటును ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. వీరిలో టిడిపి సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పై వ్యతిరేకత ఉందని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేయటం ఆయనపై ప్రజలకు ఇప్పటికే సానుభూతి పెరిగిందని టిడిపి శ్రేణులు.

అంతేకాకుండా టిడిపితో కలిసి జనసేన పార్టీ పొత్తు ఉంటుందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు.  దీంతో 2014 ఎలక్షన్ ఫలితాలు తిరిగి పునరావృతం అవుతాయని ఇరు పార్టీల నాయకులు ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలను గమనిస్తున్న టిడిపి నాయకులు నరసరావుపేట అసెంబ్లీ సీటు హాట్ కేక్ గా మారింది. అయితే అసెంబ్లీ ఇన్చార్జి పగ్గాలు చేపట్టిన బీసీ నాయకులు, డాక్టర్ చదలవాడ అలిగింద బాబుకే టిడిపి అధిష్టానం సీటు కన్ఫామ్ చేసిందని విశ్వసనీయ సమాచారం. 

నరసరావుపేట నియోజకవర్గం ఏర్పడిన మొదటి నుంచి కూడా కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలే గెలుస్తూ వచ్చారు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇక్కడ ఐదుసార్లు కమ్మ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ కోడెల శివప్రసాదరావు గెలిచారు. ఇక్కడ టిడిపి సీటు ను కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకునికి ఇస్తేనే గెలుస్తాం అన్న నమ్మకం చాలా మందిలో ఉంది. ఈ సెంటిమెంట్ ను దృష్టిలో ఉంచుకున్న నరసరావుపేట అసెంబ్లీ సీటును ఆశిస్తున్న ఆ సామాజిక వర్గం వారిలో డాక్టర్ కడియాల వెంకటేశ్వర్లు, నల్లపాటి రామచంద్ర ప్రసాద్ (నల్లపాటి రాము) తో పాటు ప్రముఖ వ్యాపారవేత్త కూడా ఉన్నారు.

టిడిపి పార్టీ కి మొదటి నుంచి కూడా బీసీలు అండగా ఉన్నారని, గత అన్ని ఎలక్షన్లలో కూడా బీసీ నాయకులకు టిడిపి కూడా అండగా ఉందని చెబుతారు. అందులో భాగంగానే పల్నాడు జిల్లాలో ఒక బీసీ అభ్యర్థిని కచ్చితంగా సీటు ఇవ్వాలని అధిష్టానం చెప్పిందని, దానికి అనుగుణంగా బీసీ నాయకులైన డాక్టర్ చదలవాడకు సీటు కచ్చితంగా ఉంటుందని ఆ పార్టీ నాయకులు స్పష్టంగా చెబుతున్నారు. అందరితో కలిసి మెలిసి ఉండే అరవింద్ బాబు ఇప్పటికే సీటు ఆశిస్తున్న టిడిపి నాయకులను కలుపుకొని పోతున్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కచ్చితంగా పార్టీ గెలుపు కోసం పనిచేసిన నాయకులను గుర్తిస్తుందని, వారికి సమున్నత పదవులను కట్టబెడుతుందని టిడిపి వర్గాలు చెబుతున్నారు.

ఏదేమైనా డాక్టర్ చదలవాడ అరవింద బాబు గత ఐదు సంవత్సరాలుగా పార్టీలో ఎన్ని కష్టాలు, నష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులను ఎదురైనా తట్టుకుని నిలబడుతున్నారు. నియోజకవర్గంలో ఉన్న అసంతృప్తులను కలుపుకొని పోతూ ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. అదేవిధంగా రానున్న ఎలక్షన్లలో పార్టీ అధికారంలోకి రావాలని కృషి చేస్తూనే, తాము చేయబోయే కార్యక్రమాల గురించి ప్రజలకు విపులంగా అర్థమయ్యేలా చేస్తూ ప్రచార పర్వం చేపడుతున్నారు.

Related posts

Ultimate Tragedy: కుప్పలు తెప్పలుగా…. కరోనా శవాలు

Satyam NEWS

అప్పుడే పండుగ‌..

Satyam NEWS

నవంబర్ 30న పోలింగ్.. డిసెంబర్ 3న కౌంటింగ్

Satyam NEWS

Leave a Comment