38.2 C
Hyderabad
May 5, 2024 20: 38 PM
Slider వరంగల్

అక్రమంగా రవాణా చేస్తున్న పిడిఎస్ రైస్ స్వాధీనం

#pdsrice

ములుగు జిల్లా ఎస్ పి గౌష్ అలం ఆదేశాల మేరకు CCS  సిఐ పి.దయాకర్ రావు అధ్వర్యంలో పసర పోలీసుల సమన్వయంతో పసర  రహదారి గుండా పిడిఎస్ రైస్ ను  DCM వాహనం లో అక్రమంగా  తరలిస్తున్నారనే నమ్మదగిన సమచారంతో  పస్రా సర్కిల్ నందు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అనుమానాస్పదంగా  వెళుతున్న డీసీఎం నెంబర్ TS12 UA 1114 ని ఆపి తనిఖీ చేసి అందులోని వ్యక్తులను  అదుపులోకి తీసుకొని విచారించారు.

DCM లో  సుమారు 75 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ ఉన్నదని, లింగాల పరిసర ప్రాంతాల నుండి సేకరించిన పి డి ఎస్  బియ్యాన్ని ప్రజల వద్ద నుండి తక్కువ డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసి, ఒక్కసారిగా మహారాష్ట్ర కి తీసుకుని వెళ్లుతున్నారని పోలీసులకు తెలిసింది. ఈ బియ్యం అక్కడ అమ్మితే ఎక్కువ మొత్తంలో లాభం వస్తుందని, అధిక లాభాలకు ఆశపడి ఈ విధంగా చేశామని ఒప్పుకోవడం జరిగింది.

మహారాష్ట్ర కి వెళ్లే క్రమంలో పట్టుబడ్డామని నిందితులు తెలియజేయడం జరిగింది. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని 75 క్వింటాళ్ల బియ్యం లోడ్ గల DCM ను స్వాధీన పర్చుకోవటం జరిగింది. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ సుమారుగా లక్షా 12 వేల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

పోలీసులు అరెస్టు చేసిన వారిలో 1.మాలోత్ తిరుపతి s/o రాంకు నాయక్, R/o. మహముత్తరాం, 2. మొక్క సతీష్ s/o.రాజయ్య  R/o నార్లాపూర్ 3. బీద సుధాకర్ s/o లక్ష్మయ్య R/o మహముత్తరాం ఉన్నారు. ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ పేదలకు చెందాల్సిన PDS బియ్యం ను అక్రమంగా నిల్వ చేసిన, తరలించిన వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోబడుతాయి అని చెప్పటం జరిగింది. ఈ తనిఖీలో సి ఐ సి సి ఎస్ దయాకర్ రావు, సి ఐ పస్రా శంకర్,ఎస్ ఐ పస్రా షైక్ మస్తాన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

రాహుల్ ను సద్దాంతో పోల్చడం పై కాంగ్రెస్ ఆగ్రహం

Bhavani

విమానాశ్రయాల్లో సందర్శకులకు అనుమతి రద్దు

Satyam NEWS

బెంగాల్‌లో బీజేపీలో సుప్రియో ట్వీట్ రచ్చ

Sub Editor

Leave a Comment