28.7 C
Hyderabad
May 6, 2024 10: 49 AM
Slider ముఖ్యంశాలు

బంద్ సందర్భంగా రాస్తారోకో చేసిన టీడీపీ నేతల అరెస్టు

#rompicherla

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ గూండాల దాడిని నిరసిస్తూ తెలుగుదేశం నేతలు చేపట్టిన రాస్తారోకో సందర్భంగా పలువురిని అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు అరెస్ట్ కు నిరసిస్తూ అద్దంకి- నార్కెట్ పల్లి హై వే పై టీడీపీ కార్యకర్తలు బైఠాయించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల టిడిపి నాయకులు మండలంలో సుబ్బయ్యపాలెం గ్రామంలో గల హై వే రోడ్డు పై రాస్తారోకో చేశారు.

రాస్తారోకో సందర్భంగా రోడ్డుకి ఇరు వైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ రాస్తారోకోకు టిడిపి మండల అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డి నాయకత్వం వహించారు. సీఎం జగన్ డౌన్ డౌన్ చంద్ర బాబు నాయుడు నాయకత్వం వర్దిలాల్లి, జై చదలవాడ, జై జై చదలవాడ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. సుమారు గంటకు పై గా జరిగిన ఈ రాస్తారోకోలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ప్రయాణీకులు, వాహనదారులు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పోలీసులు వారిచే రాస్తారోకో విరమింపజేశారు. అదే విధంగా రాష్ట్ర బంద్ నేపథ్యంలో మండలంలో అలవాల గ్రామానికి చెందిన టిడిపి మండల అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిని పలువురు టిడిపి నాయకులకు పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అనంతరం వారిని వ్యక్తిగత పూచీకత్తు పై విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ లింగ వెంకటేశ్వర్లు, రొంపిచర్ల మండల గ్రామ మాజీ సర్పంచ్లు ఇంటూరి ప్రసాద్,ఇంటూరి వెంకట్ రావు, ఇంటూరి వేణు బాబు,పోనుగోటి సాంబశివరావు,టీడీపీ నాయకులు అల్లూరి కోటేశ్వరరావు,సురబత్తుల రామారావు,పల్లెల శివారెడ్డి,మన్నాం నరసింహ రావు,పోనుగోటి వెంకట్ రామయ్య,బాషా తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఉద్యమకారులను గుండెల్లో పెట్టి చూసుకుంటా

Bhavani

జొన్నాడ లో ఇసుక ర్యాంప్ ను పరిశీలించిన చంద్రబాబు

Satyam NEWS

త్వరలో పూర్తి స్థాయిలో విద్యావ్యవస్థ ప్రక్షాళన

Satyam NEWS

Leave a Comment