27.7 C
Hyderabad
May 4, 2024 08: 21 AM
Slider విజయనగరం

కేంద్ర‌ మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఇంటివ‌ద్ద ఉద్రిక్త‌త‌…!

#ashokgajapatiraju

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గూండాలు దాడి చేసిన నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్త బంద్ న‌కు టీడీపీ పిలుపు నిచ్చింది. ఈ క్ర‌మంలోనే జిల్లాకేంద్రంలోని ఎత్తు బ్రిడ్జి  వ‌ద్ద  ఉన్న అశోక్ బంగ్లా నుంచీ బంద్ కోసం రోడ్ల మీద‌కు వ‌చ్చే నేత‌ల‌ను పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు చంద్ర‌బాబు ఇచ్చిన పిలుపు మేర‌కు జిల్లాలో  టీడీపీ నేత‌లంతా ధ‌ర్నాకు ఉపక్ర‌మించారు. పొద్దున్నే జిల్లాలోని సాలూరు, బొబ్బిలి, పార్వ‌తీపురం, చీపురుప‌ల్లిలోనే టీడీపీ నేత‌లంతా రోడ్డు ఎక్క‌గా అక్క‌డిక్క‌డే పోలీసులు ఆ నేత‌లంద‌రినీ అరెస్ట్ చేసారు.

ఇక జిల్లా కేంద్రంలోని అశోక్ బంగ్లా వ‌ద్ద పార్టీ నేత‌లు ఐపీవీ రాజు, ఆదితి జ‌గ‌జ‌ప‌తిరాజులు,క‌న‌క‌లు  ఇత‌ర  నేతలంతా రోడ్డు మీద‌కు వ‌చ్చారు. అయితే అక్క‌డే ముంద‌స్తుగానే బంగ్లా ఎదుట మొహ‌రించారు…పోలీసులు. పార్టీ నేత‌లు ఏ ఒక్క‌రినీ బ‌య‌ట‌కు రానివ్వ‌కుండా అడ్డుకున్నారు.ఒకానొక స‌మ‌యంలో  అటు పోలీసులు,ఇటు పార్టీ నేత‌ల మధ్య తొపులాట జ‌ర‌గ‌డంతో ఏం జరుగుతుందో తెల‌య‌ని ప‌రిస్థితినెల‌కొని ఉంది. 

అప్ప‌టికే  అక్క‌డ ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దేందుకు  పీటీసీడీఎస్పీ వెంక‌ట అప్పారావు, వ‌న్ సీఐ  ముర‌ళీ, ఎస్ఐ ప్ర‌సాద్ లు వ‌చ్చినా.. పార్టీ నేత‌లు మాట విన‌క‌పోవ‌డంతో ఓఎస్డీ సూర్యచంద్ర‌ర‌రావు రంగంలోకి దిగారు. గేటులోప‌ల‌కు వెళ్లి  పార్టీ నేత‌ల‌తో మాట్లాడారు. బంగ్లా గేట్ వ‌ద్ద  ఉన్న ఇనుప కంచె ఓ ల‌క్ష్మ‌ణ రేఖ అని అదిదాటితే అరెస్ట్ చేస్తామ‌ని హెచ్చ‌రించారు. కాస్సేప‌టికి  గొడ‌వ సర్దుమ‌ణ‌గ‌డంతో ఎక్క‌డి   వాళ్లు అక్క‌డే ఉండ‌టంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

వాళ్లు ఖాకీ డ్ర‌స్ లు వేసుకుని వైఎస్ఆర్సీపీ జెండాలు ప‌ట్టుకున్న కార్య‌కర్త‌లు…!

విజ‌య‌న‌గ‌రం జిల్లా కేంద్రంలోని కేంద్ర మాజీమంత్రి అశోక్ బంగ్లాలో టీడీపీ నేతలెవ్వ‌రినీ బ‌య‌ట‌కు వెళ్ల నివ్వ‌కుండా పోలీసులు అడ్డుకున్న సంగ‌తి విదిత‌మే. అనంతరం బంగ్లాలోనే పార్టీ కార్య‌క‌ర్తల నుద్దేశించి పార్టీ నేత ఆదితి గ‌జ‌ప‌తిరాజు మాట్లాడారు.జ‌రిగిన గొడ‌వ‌కు కార‌ణం ఏంట‌ని స్వ‌యంగా డీజీపీకి ఫోన్ చేసినా స్విచ్ఛాప్ అయిన దానిపై ఎవ‌రికి ఎవ‌రు వ‌త్తాసు ప‌లుకుతున్నారో  అర్ద‌మ‌వుతుంద‌ని ఆమె అన్నారు.

క‌నీసం నిర‌స‌న తెలియ‌చేయ‌డాన‌కి  బంగ్లా నుంచీ ఎవ్వ‌రినీ బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా పోలీసులు అడ్డుకోవ‌డం బ‌ట్టే…పోలీసులంతావైఎస్ఆర్సీపీ వాళ్లేన‌ని స్ప‌ష్టం అవుతోంద‌న్నారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి బుద్దిని జ్ఙానాన్ని ప్ర‌శాంతించాల‌ని కోరుకుంటున్నాన‌ని అలాగే తాను ఓ రాజీకయ కుటుంబం నుంచీ వ‌చ్చాన‌ని అటు తండ్రి త‌రుఫ‌/న ఇటు త‌ల్లి త‌రుపున ఇద్ద‌రూరాజ‌కీయాల‌లో దిగ్గ‌జాలేన‌ని అలాంటి నాకు…విజ‌య‌న‌గ‌రం పోలీసుల తీర‌రేంటో  స్ప‌ష్ట‌మైంద‌ని ఆమె అన్నారు.

Related posts

కేదార్నాథ్ శివలింగంపై నోట్లు వెదజల్లిన మహిళ

Bhavani

సంక్షేమ పథకాలు వైఎస్ రాజశేఖరరెడ్డి చలవే

Satyam NEWS

ఉన్న పెన్షన్లు కూడా కట్ చేస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment