27.7 C
Hyderabad
May 4, 2024 08: 53 AM
Slider మహబూబ్ నగర్

ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు తాత్వికత బోధించాలి

#Minister Singireddy Niranjan Reddy

వనపర్తి జిల్లా మారిన పరిస్థితులకు అనుగుణంగా ఉత్తమ పౌరులను తయారు చేయడానికి తాత్వికంగా బోధించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ అన్నారు.  జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని వనపర్తి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం హాల్లో మంగళవారం ఉదయం జరిగిన జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ సన్మాన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసగించారు. ఈ కార్య్రమానికి జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ అధ్యక్షత వహించగా ఉత్తమ ఉపాధ్యాయులకు మంత్రి చేతుల మీదుగా సన్మానం చేశారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏ వ్యక్తికైనా మొదటి గురువు తల్లి, తండ్రి ఆ తర్వాత తనకు ఉపయోగపడే విషయాలు, భవిష్యత్తుకు దారి చుపగలిన వారు ఎవరైనా గురువే అని తెలిపారు.  పాఠశాల స్థాయి నుండి కళాశాల స్థాయి వరకు బోధించేవారు అందరూ ఉపాధ్యాయులే అని అందువల్ల ఉపాధ్యాయులు అందరికీ   ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా, భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకొని   సమాజాన్ని నడిపించేవాడు నాయకుడు అవుతాడని, సమాజం అటువంటి న్నాయకుడినే ఎన్నుకోవాలని సూచించారు. కొత్త విజ్ఞానాన్ని, పురోగతిని పెంపొందించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే అని కాబట్టి కొత్త తరాన్ని తయారు చేయాలని పిలుపునిచ్చారు.

సర్వేపల్లి రాధాకృష్ణ 20వ శతాబ్దంలో ఒక గొప్ప తాత్వికవేత్త అని చెప్పారు.  తాను నిత్యవిద్యర్తిగా ఉంటూ నేర్చుకున్న విషయాలను ఇతరులకు బోధించేవాడు అని తెలిపారు. అందుకే ఆయనను ప్రపంచ స్థాయి ఫిలాసఫర్ అంటరాని తెలిపారు. భారత దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో సైతం సర్వేపల్లి విద్యా బోధన చేశారని కొనియాడారు. వనపర్తి జిల్లాలో రాష్ట్రస్థాయి నే కాకుండా జాతీయ స్థాయి విద్యాలయాలు ఉన్నాయని అందులో చదివే విద్యార్థులకు తాత్వికతతో ఉత్తమ బోధన అందించి వనపర్తి జిల్లాను విద్యాపర్తి జిల్లా గా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.

అనంతరం వనపర్తి జిల్లా నుండి  రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన శోభారాణి, మునింద్రమ్మ, మురళి కృష్ణ ను మంత్రి అభినందించారు.  వనపర్తి జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులు గా ఎంపికైన 44 మంది ఉపాధ్యాయులను మెమెంటో, శాలువాలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న జడ్పి చైర్మన్ ఆర్. లోక్ నాథ్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి అత్యంత గౌరవప్రదమైన గురుతర బాధ్యత లు కలిగిన వృత్తిగా అభివర్ణించారు. అందువల్ల ఉపాధ్యాయులు తమ గురుతర బాధ్యతలను విస్మరించవద్దని గుర్తు చేశారు. జిల్లాలో చాలా పాఠశాలలలో ఉత్తమ బోధన జరుగుతుందని, కొన్ని పాఠశాలలు మాత్రం చిన్న చిన్న కారణాలు చెపుతూ తమ బాధ్యతల నుండి  తప్పించుకుంటున్నారు అన్నారు. ఇప్పుడున్న పిల్లలు కష్టపడి చదివే జిజ్ఞాస ఉన్నవాళ్ళని వారికి ఉత్తమ విద్యాబోధన చేయాలని సూచించారు.

కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ ఒక ఉపాధ్యాయుదిగా ఉంటూ దేశ నిర్మాణంలో ఎంతో వ్యవహరించారని కొనియాడారు. తాను కలెక్టర్ కావడానికి ఉపాధ్యాయులే కారణమని తన తల్లిదండ్రులు సైతం ఉపాధ్యాయులే అని తెలిపారు.  మారుతున్న కాలానికి అనుగుణంగా మన విద్యా విధానాలు మరాల్సిను ఉంటుందన్నారు. ఎప్పుడు నిత్యవిద్యార్తిగా ఉంటూ కాలానికి అనుగుణంగా విద్యాబోధన చేయాలన్నారు. కృత్యాధార బోధన, ఎఫ్.ఎల్.ఎన్, ఉన్నతి, లక్ష్యా ఇదేకోవకు చెందినవిగా తెలియజేశారు.

ఒక విద్యార్థికి తాను బోధించిన విద్య ఎంత వరకు అర్థం చేసుకున్నాడు, అర్థం కాని అంశాలు ఎంటీవీ అనేవి తెలుసుకొని బోధించాలని సూచించారు. విద్యార్థులు సన్మార్గంలో నడిచేవిధంగా, క్రమశిక్షణ, నైపుణ్యాలు పెంచుకునే విధంగా   మంచి విలువలతో కూడిన విద్యాబోధన చేసి వనపర్తి విద్యాపర్థిగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎస్. తిరుపతి రావు, డి. ఈ. ఒ గోవిందరాజులు, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ పలుస రమేష్ గౌడ్, ఎం. ఈ. ఒ లు, క్లస్టర్ హెడ్మాస్టర్ లు, ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు  పాల్గొన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

మంత్రి కోడాలి నాని పై చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

పెద్ద నోట్ల రద్దు పై ఆర్ బీ ఐ, కేంద్రానికి సుప్రీం నోటీసులు

Satyam NEWS

విజ‌య‌న‌గ‌రం గంట స్తంభం సాక్షిగా మండుటెండ‌లో సర్పంచుల బిక్షాటన

Satyam NEWS

Leave a Comment