27.7 C
Hyderabad
April 30, 2024 08: 16 AM
Slider విజయనగరం

విజ‌య‌న‌గ‌రం గంట స్తంభం సాక్షిగా మండుటెండ‌లో సర్పంచుల బిక్షాటన

ఏపీ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా సర్పంచుల సంఘం బిక్షాటన కార్యక్రమం చేపట్టింది.ఈమేర‌కు విజయ నగరం నడిబొడ్డున గంటస్తంభం సాక్షిగారాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ నేత‌లు గేదెల రాజారావు కర్రోతు సత్యనారాయణ తుంపల్లి రమణ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు

ఈ సందర్భంగా గా రాష్ట్ర కార్యదర్శి రాజా రావు మాట్లాడుతూ గ్రామంలో ఏ పనులు జరగాలన్నా పంచాయతీలు నిధులు తోనే జరుగుతాయని అటువంటిది సీఎం జ‌గ‌న్ సర్పంచులకు ఉన్న ఏకైక ఆసరా పంచాయతీ నిధులు లాక్కోవడం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయడమేనని విమర్శించారు ఇప్పటికే అనేక గ్రామాల్లో సొంత నిధులతో గ్రామాల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న సర్పంచుల నిధులు దారి మళ్లించి స్థానిక సంస్థల ప్రతినిధులు నట్టేట ముంచారని ఇది ప్రజాస్వామ్య బద్దం కాదని విమర్శించారు

కార్య‌క్ర‌మంలో కర్రోతు సత్యనారాయణ మాట్లాడుతూ దేశ అభివృద్ధికి గ్రామాలు పట్టు కొమ్మలని గాంధీజీ మాటలను పక్కన పెట్టి గ్రామాల అభివృద్ధి నిర్వీర్యం చేశారన్నారని ఆరోపించారు.సర్పంచులు స్థానిక ప్రజలకు సేవలు అందించాలన్నా సౌకర్యాలు అందించాలంటే పంచాయతీలు బలంగా ఉండాలని పంచాయతీ కున్న ఆసరా నిధులు సైతం ముఖ్యమంత్రి వైసీపీ ప్రభుత్వం లాక్కోవడం సిగ్గుచేటన్నారు

ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని ఇది మంచి సంకేతం కాదని అన్నారు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పందించి నిధులు నేరుగా పంచాయతీ లికె మంజూరు చేస్తామని చెప్పారని రాష్ట్ర ప్రభుత్వం ఈప్పటికైనా నా స్పందించి సర్పంచుల అధికారాలను కాలరాసే ప్రక్రియను ముగించాలని నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు

ఈ కార్యక్ర‌మంలో సర్పంచుల సంఘం నేత‌లు బొబ్బ ది ఈశ్వరరావు రామకృష్ణ సోమ నాయుడు శ్రీనివాసులు పాల్గొన్నారు.

Related posts

కొల్లాపూర్ ప్రచార సరళిపై కేటీఆర్ అసంతృప్తి

Satyam NEWS

భారత్ బయోటెక్ కోవాక్సిన్ సామర్ధ్యంపై అనుమానాలు

Satyam NEWS

గుడ్ డెసిషన్: పౌల్ట్రీ ఫారం యాజమాన్యాల ఔదార్యం

Satyam NEWS

Leave a Comment