37.2 C
Hyderabad
April 30, 2024 12: 40 PM
Slider ముఖ్యంశాలు

సింగరేణి కార్మికులకు త్వరలో వేజ్ బోర్డు ఏరియర్స్

#Singareni Workers

సింగరేణి కార్మికులకు చెల్లించాల్సిన 23 నెలల 11వ వేజ్‌బోర్డు బకాయిలను వీలైనంత త్వరగా చెల్లించేందుకు ముమ్మర ఏర్పాటు జరుగుతున్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.1,726 కోట్ల బకాయిలు చెల్లించనున్నామని, దీంతో ఒక్కో కార్మికుడు సగటున రూ.4 లక్షల వరకు ఎరియర్స్‌ అందుకుంటాడని సింగరేణి డైరెక్టర్‌ ఎన్‌ బలరామ్‌ ప్రకటించారు.

కార్మికులకు ఇంత పెద్ద మొత్తంలో బకాయిలను చెల్లించడం సింగరేణి చరిత్రలో ఇదే తొలిసారని, ఈ బకాయిలను నెల రోజుల వ్యవధిలో రెండు విడతలుగా కార్మికుల ఖాతాల్లో జమ చేయనున్నామని వెల్లడించారు.పర్సనల్‌, అకౌంట్స్‌, ఆడిటింగ్‌, ఈఆర్పీ, ఎస్‌ఏపీ, ఐటీ తదితర విభాగాల సమన్వయంతో శుక్రవారం నుంచే వేతన బకాయిల లెకింపు ప్రక్రియను ప్రారంభించినట్టు తెలిపారు.

తొలుత వేతన బకాయిలకు సంబంధించిన ఆడిటింగ్‌ను, ఆ తర్వాత మిగిలిన ప్రక్రియలను వేగంగా పూర్తిచేసి చెల్లింపులకు మార్గం సుగమం చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించినట్టు వివరిoచారు.వేతన బకాయిలను నెలరోజుల్లోపే చెల్లించాలని ప్రాథమికంగా అనుకుంటున్నప్పటికీ అంతకన్నా ముందే చెల్లించేందుకు కృషి చేస్తున్నట్టు బలరామ్‌ తెలిపారు.

11వ వేజ్‌ బోర్డు సిఫారసులను అందరికన్నా ముందే సింగరేణిలో అమలు జరిపామని, దీంతో సంస్థపై ఏటా దాదాపు రూ.1,200 కోట్ల అదనపు భారం పడుతున్నదని పేర్కొన్నారు.

దీనికి రూ.1,726 కోట్ల ఎరియర్స్‌ను కూడా కలిపితే మొత్తం దాదాపు రూ.3 వేల కోట్లు అవుతుందని తెలిపారు. తొలుత ఉద్యోగంలో ఉన్న కార్మికులకు, ఆ తర్వాత పదవీ విరమణ చేసిన కార్మికులకు బకాయిలు చెల్లించనున్నట్టు చెప్పారు.

Related posts

టూర్:పాకిస్తాన్ అధ్యక్షునితో శత్రుఘన్ సిన్హా మీట్

Satyam NEWS

మోసపోయిన మౌనిక దీక్షకు ప్రజాసంఘాల మద్దతు

Satyam NEWS

జగన్ ఎలా దోచేస్తున్నాడనేది ప్రజలు తెలుసుకోవాలి

Satyam NEWS

Leave a Comment