26.7 C
Hyderabad
May 3, 2024 07: 47 AM
Slider నల్గొండ

దేశానికి సాంకేతిక విప్లవం అందించిన ఘనత రాజీవ్ గాంధీదే

#nalgonda congress

దేశానికి సాంకేతిక విప్లవం తీసుకువచ్చిన ఘనత భారత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీకే దక్కుతుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ నాయక్   అన్నారు.రాజీవ్ గాంధీ 78వ జయంతి  సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో   శుక్రవారం నల్లగొండ పట్టణంలోని హైద్రాబాద్ రోడ్డులో గల  రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని అన్నారు.దేశానికి స్వాతంత్రం తీసుకు వచ్చింది, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.ఆనాడు భారత ప్రధానిగా ఉన్న రాజీవ్ గాంధీ  సాంకేతిక విప్లవానికి నాంది పలకడంతో నేడు దేశం అన్ని రంగాలలో  ముందుకు పోతుందని అన్నారు. దేశానికి సుస్థిర పాలన అందించడంతో పాటు పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేశాడని అన్నారు. బ్యాంకులను కూడా జాతీయం  చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు.

కానీ నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని విమర్శించారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని విస్మరించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, నల్లగొండ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, ఎంపీపీ మనిమద్దె సుమన్, తిప్పర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జూకూరి రమేష్ , ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆదిమల్ల శంకర్ ,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు కత్తుల కోటీ ,బొజ్జా శంకర్,ఎర్పుల రవి , వల్లే నారాయణరెడ్డి,అల్లి సుభాష్ యాదవ్,గురిజ వెంకన్న , అజయ్ తదితరులు పాల్గొన్నారు.

పెద్ది నరేందర్, సత్యం న్యూస్, నకిరేకల్

Related posts

షిర్డీ సహా అన్ని గ్రామాలలో కొనసాగుతున్న బంద్

Satyam NEWS

కార్మికుల సమస్యలను విస్మరిస్తే ప్రభుత్వాల మనుగడ ఉండదు

Satyam NEWS

భారీ గా పడిపోయిన అడ్మిషన్లు

Bhavani

Leave a Comment