కొందరు అవాకులు చవాకులు పేలుతున్నారు. ఎవరు ఏమి అన్నా హుజూర్ నగర్ ప్రజలు ఇచ్చిన మద్దతుతో ముందుకు సాగుతానని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. హుజూర్ నగర్ లో నేడు జరిగిన ప్రజా కృతజ్ఞత సభలో ఆయన ప్రసంగించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ త్వరలోనే పూర్తి అవుతుదని అది పూర్తి అయితే జిల్లా అభివృద్ధి ముఖచిత్రం మారిపోతుందని ఆయన అన్నారు. హుజుర్ నగర్ మున్సిపాలిటీకి 25 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అదే విధంగా నేరేడుచర్లకు 15 కోట్ల మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గిరిజన బిడ్డల కోసం రెసిడెన్షియల్ స్కూల్, బంజారా భవన్ కూడా మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పోడు భూముల సమస్య పరిష్కరిస్తాని ముఖ్యమంత్రి వెల్లడించారు. హుజూర్ నగర్ రెవెన్యూ డివిజన్ వెంటనే మంజూరీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. అదే విధంగా ఈఎస్ఐ ఆస్పత్రి, పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేశారు. హుజూర్ నగర్ కు కోర్టు మంజూరు చేశారు. హుజుర్ నగర్ కు రింగ్ రోడ్డు, ట్యాంక్ బండ్ ఇచ్చారు. కేసీఆర్ గా ఒక్కటే మాట సాగర్ ఆయకట్టుకు వస్తా పదిహేను రోజుల్లో ఎమ్మెల్యేలను వెంట బెట్టుకుని వస్తా. ఆయకట్టు సమస్యలు పరిష్కరిస్తా. జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు అందరూ తిరిగి ఒక ఐడియాకు వస్తే… నేను వస్తా. మొత్తం ఆయకట్టు పారేలా చర్యలు. కుర్చీ వేసుకుని పని చేస్తా. అన్ని లిఫ్టుల నిర్వహణ బాధ్యతలు ప్రభుత్వమే టేక్ ఓవర్ చేస్తుంది. అందులో పనిచేసే సిబ్బందికి ప్రభుత్వమే జీతాలు ఇస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు.
previous post