33.7 C
Hyderabad
April 30, 2024 00: 43 AM
Slider హైదరాబాద్

డ్రైనేజి పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

#amberpet

అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కాచిగూడ డివిజన్ లోని కాశీరాం జీరా లైన్లో 25 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా వేయనున్న డ్రైనేజీ పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే అక్కడ పాదయాత్రగా పర్యటించి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకొని సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అన్ని రకాలుగా మేలు చేసే పనులను చేస్తోందని అన్నారు.

పాదయాత్ర సందర్భంగా ప్రజలు కోరిన విధంగా వెంటనే వీధి దీపాలు ఏర్పాటు చేయిస్తానని తెలిపారు. అలాగే వర్షం లేదా వరద వచ్చినప్పుడు బస్తీ వాసుల ఇళ్ళల్లోకి వస్తున్న నీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా ప్రత్యేక వరద నీటి పైప్ లైన్ ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అలాగే ప్రజల విజ్ఞప్తి మేరకు వీధి మొదట్లో ఉన్న డంపింగ్ యార్డ్ ను అక్కడి నుండి వేరే చోటుకు మార్పిస్తానని తెలిపారు. ఆ తరువాత ఎమ్మెల్యే అక్కడే ఉన్న సంబంధిత అధికారులకు, పై సమస్యలు తీర్చే విధంగా చర్యలు చేపట్టాలని, అదే విధంగా ఇప్పుడు కాశీరాం జీరా లైన్లో వేస్తున్న డ్రైనేజ్ పైప్ లైన్ పనులు పూర్తయిన వెంటనే, దానిపై రోడ్డు వేయాలని ఆదేశించారు.

ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న డ్రైనేజ్ పైప్ లైన్ పనులు చేయిస్తున్నందుకు, అలాగే తమ సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కరిస్తున్నందుకు కాశీరాం జీరా లైన్ వాసులు ఆనందిస్తూ ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీమతి ఉమారమేష్ యాదవ్, వాటర్ వర్క్స్ డీజీఎం సన్యాసిరావు, ఏఈ భావన, జీహెచ్ఎంసీ డీఈలు సువర్ణ, దుర్గాప్రసాద్, ఏఈ దివ్య, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట్ 

Related posts

తెలంగాణలో పరిణామాలు బాధ కలిగిస్తున్నాయి

Murali Krishna

ఎన్నికల సమయంలో వాలంటీర్ లను విధులనుండి తప్పించాలి

Bhavani

క‌ళ్యాణ‌ల‌క్ష్మీ చెక్కుల పంపిణీ చేసిన మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి

Sub Editor

Leave a Comment