29.7 C
Hyderabad
April 29, 2024 07: 05 AM
Slider ఆదిలాబాద్

సైబర్ నేరాల నిరోధానికి జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సైబర్ వారియర్లు

#adilabad police

జిల్లాలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకోవాలని అదిలాబాద్ జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర పేర్కొన్నారు, సోమవారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్ లోని సమావేశ మందిరంలో జిల్లా పోలీసు అధికారులతో శాంతిభద్రతలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

పోలీస్ స్టేషన్ లోని సీనియర్ ఎస్సైలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైనారు. ముందుగా 13 ఫంక్షనల్ వర్టికల్ విభాగంలో కేటాయించిన విధులపై సమీక్షించారు. పోలీస్ స్టేషన్లో 5ఎస్ విధానం అమలు తీరుపై ఎస్సైలను అడిగి తెలుసుకున్నారు, కమ్యూనిటీ పోలీసింగ్, రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, ఆర్థిక నేరాలు, షీ టీం, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, టాస్క్ ఫోర్స్, మహిళల భద్రత, మిస్సింగ్ కేసులు, ఈ-చాలాన్లు, పెండింగ్ కేసులు, నాన్ బెయిలబుల్ వారెంట్లు, కోర్టు కేసులు తదితర వాటిపై చర్చించి పోలీస్ అధికారులతో వివరణ తీసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ఈనెల జిల్లా వ్యాప్తంగా 83 సీసీటీవీ కెమెరాలు అమర్చినట్లు తెలిపారు. సీసీటీవీ కెమెరాల పనితీరుపై రెండు డివిజన్ లో ఐటీ కోర్ పోలీసు టీం సభ్యులు సమీక్షించాలని సూచించారు. పనిచేయని చోట వెంటనే మరమ్మతులు చేపట్టాలని సూచించారు, సైబర్ నేరాలను అదుపు చేయడానికి రాష్ట్ర స్థాయిలో మూడు అంచెల వ్యవస్థ పని చేస్తుందని, బాధితులు డబ్బులు కొట్టేశారని తెలిసిన వెంటనే ముందుగా 155260 లేదా డయల్-100కి ఒక్క కాల్ చేస్తే డబ్బులు కాపాడే అవకాశం ఉంటుందని తెలిపారు.

పోయిన నగదు.. జమ అయిన ఖాతా నుంచి డ్రా చేయకుండా నిలువరించే అవకాశం ఉంటుందని తెలిపారు. బాధితులు త్వరగా సమాచారం అందించినచో సంబంధిత బ్యాంకుకి పోలీసులు సమాచారం అందించి, నిధులు సైబర్ నేరగాళ్ల జేబుల్లోకి వెళ్లకుండా అడ్డుకోవచ్చని తెలిపారు, ప్రస్తుతం ఆన్ లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్న దృష్ట్యా ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. సైబర్ నేరగాళ్ల బారినపడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఆన్ లైన్ కేటుగాళ్ల మాయమాటలు నమ్మి మోసపోవద్దని, ఒకవేళ మోసపోయిన వెంటనే సమయస్ఫూర్తితో వ్యవహరించి, డబ్బులు వెంటనే తిరిగి తెచ్చుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాత్రి సమయంలో నేరాలను కట్టడి చేయడానికి అదనంగా పెట్రోలింగ్ వాహనాలను సమకూర్చినట్లు తెలిపారు. పోలీసు దర్యాప్తులో మరింత నాణ్యత పెంచడానికి క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నాణ్యత ప్రమాణాలతో భౌతిక సాక్షాలతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి న్యాయస్థానంలో కేసులు రుజువు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం కల్పించి, ఫిర్యాదు వచ్చిన వెంటనే షీ టీం బృందాలు బాధితుల వద్దకు చేరుకొని న్యాయ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. బాల్య వివాహాలు, నిర్బంధ కార్మికులు, మహిళల లైంగిక వేధింపులపై సమీక్షించడానికి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.

ఈ సమావేశంలో ఏఎస్పి హర్షవర్ధన్ శ్రీవాత్సవ్, అదనపు ఎస్పీలు సి. సమయ్ జాన్ రావు, బి వినోద్ కుమార్, డీఎస్పీలు ఎన్ ఎస్వీ వెంకటేశ్వరరావు,ఎన్. ఉదయ్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ సిఐ జి. మల్లేష్, డిసిఆర్బి సిఐ జాదవ్ గున్వంతరావు, ట్రాఫిక్ సీఐ ఏ. రాంనరసింహారెడ్డి, పట్టణ సీఐ లు పోతారం శ్రీనివాస్, ఎస్ రామకృష్ణ, కే పురుషోత్తం చారి, జైనథ్ సిఐ కొంక మల్లేష్, ఇచ్చోడ సీఐ కంప రవీందర్, బోథ్ సీఐ ఎం నైలు, నార్నూర్ సిఐ కె ప్రేమ్ కుమార్, ఉట్నూర్ సీఐ కే. నరేష్ కుమార్, ఎస్సైలు ఎం ఏ హకీమ్, పోలీస్ పరిపాలనాధికారి మొహమ్మద్ యూనిస్ అలి, పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెంచల వెంకటేశ్వర్లు, కార్యదర్శి గిన్నెల సత్యనారాయణ, పోలీస్ స్టేషన్ నుండి ఇ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎస్సైలు పాల్గొన్నారు.

Related posts

విద్వేషాలను రగిల్చే చిత్రం ‘ది కేరళ స్టోరీ’

Satyam NEWS

ఆల్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడికి ఘన సన్మానం

Satyam NEWS

ఇయర్ ఎండ్ లో గుడ్ న్యూస్ చెప్పిన ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్…!

Satyam NEWS

Leave a Comment