Slider తెలంగాణ

కోటి ఎకరాలకు సాగునీరు అందించడంలో ప్రగతి

governor

కోటి ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యంగా ప్రభుత్వం సమగ్ర జలవిధానాన్ని రూపొందించుకుని అమలు చేసిందని రాష్ట్ర గవర్నర్ తమిళసై సుందరరాజన్ తెలిపారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా నేడు ఆమె ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.

రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా 20 లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రభుత్వం నీరందిస్తున్నదని, మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులను పునరుద్దరించామని గవర్నర్ తెలిపారు. దీనివల్ల తెలంగాణలో భూగర్భ జలమట్టం భారీగా పెరిగింది.

ప్రపంచంలోకెల్లా అతి భారీ బహుళ దశల ఎత్తిపోతల పథకంగా రికార్డు సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు దశల వారీగా పూర్తవుతున్నది. శరవేగంగా నడుస్తున్న పనులు తెలంగాణ ప్రజల కళ్ల ముందే ఉన్నాయి. త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు సంపూర్ణంగా పూర్తవుతుంది.

ఈ ఏడాది వర్షాకాలం నుంచి గోదావరి నది నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రోజుకు 3 టిఎంసిల నీటిని ఎత్తిపోసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని గవర్నర్ అన్నారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దేవాదుల ప్రాజెక్టుకు 365 రోజుల పాటు నీరందించడానికి సమ్మక్క బ్యారుజి పనులు వేగంగా జరుగుతున్నాయి.

ఈ వేసవిలోనే ఈ బ్యారేజి నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నది. ప్రస్తుత దుమ్ముగూడెం ఆనకట్ట ప్రాంతంలోనే సీతామరామ ప్రాజెక్టుకు నీరందించడానికి, 320 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తికి అనుగుణంగా ఉండేవిధంగా ప్రభుత్వం సుమారు 40 టిఎంసిల సామర్థ్య్యంతో సీతమ్మ సాగర్ బ్యారేజిని మంజూరు చేసిందని గవర్నర్ తెలిపారు.

తెలంగాణలో యాసంగి పంట సమయంలో వరి పంట సాధారణ విస్తీర్ణం 17,08,397 ఎకరాలు. నీటి పారుదల రంగంలో రాష్ట్రం సాధించిన ప్రగతి వల్ల ఈ యాసంగి సీజన్ లో వరి పంట సాగు 38,19,419 ఎకరాలుగా వ్యవసాయశాఖ నమోదు చేసింది.

యాసంగి సమయంలో 123.5 శాతం పెరిగిన వరి విస్తీర్ణం రాష్ట్రం సాధించిన విజయానికి సంకేతంగా నిలుస్తున్నదని గవర్నర్ అన్నారు. పంట సమయంలో పెట్టుబడి కోసం రైతులు పడే అగచాట్లను రూపుమాపేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మక పథకం ‘రైతుబంధు’ ఇప్పుడు భారతదేశానికే కాదు, యావత్ ప్రపంచానికి ఆదర్శనీయమైంది.

రైతులకు అండగా ఉండాలనే సత్సంకల్పంతో ఇప్పుడు ఎకరానికి పదివేల చొప్పున రెండు విడతల్లో అందిస్తున్నామని గవర్నర్ తెలిపారు. రైతుబంధు పథకం ఇప్పుడు దేశానికి ఓ రోల్ మోడల్ గా నిలిచింది. తెలంగాణ ప్రభుత్వం వేసిన ముందడుగుతో స్పూర్తి పొందిన వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ‘రైతుబంధు’ తరహా పథకాలు అమలు చేయడం భారతదేశ రైతాంగం తలరాతను మార్చే పురోగామిక మలుపు. వ్యవసాయాభివృద్ధి కోసం ప్రపంచ వ్యాప్తంగా అమలవుతున్న గొప్ప పథకాల్లో ‘రైతుబంధు’ ఒకటని ఐక్యరాజ్యసమితి ప్రకటించడం మన రాష్ట్రానికి, మన రైతులకు గర్వకారణమని గవర్నర్ అన్నారు.

Related posts

అధికారం కోసం ఆరాటం: ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల పోరాటం

Satyam NEWS

వైఎస్సాఆర్ సీపీ నాయ‌కుల పాద‌యాత్ర‌

Sub Editor

పోలీసు బాస్ లేకుండా నే ఈ వారం “స్పందన”..!

Satyam NEWS

Leave a Comment