38.2 C
Hyderabad
May 3, 2024 19: 35 PM
Slider ముఖ్యంశాలు

రుణ మాఫీ పథకం అమలు తెలంగాణలో కేవలం ఐదు శాతమే

#crop

పంట రుణమాఫీ పథకం అమలు మార్చి 20 22 నాటికి తెలంగాణ రాష్ట్రంలో కేవలం 5 శాతం మాత్రమే ఉందని, ఇది అత్యంత బాధాకరమైన విషయమని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు భాగం హేమంతరావు, ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ అన్నారు. పంట రుణాల విముక్తి చట్టం చేయాలని  పంట రుణాలు మాఫీ చేయాలని సంవత్సరాలుగా రైతాంగ చేస్తున్న పోరాటం పట్ల కేంద్ర పాలకులు స్పందించటం లేదని వారన్నారు.

ఎన్నికల సమయంలో పాలకులు చేసిన వాగ్దానాల అమలుపట్ల కూడా చిత్తశుద్ధితో లేరని, ఒకేసారి రుణమాఫీ చేసి కొత్త రుణాలను ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేస్తుందని వారు తెలిపారు. దేశవ్యాప్తంగా పంట రుణాల మాఫీ పథకం అమలు అత్యంత బాధాకరంగా ఉంది. కేవలం 50% మాత్రమే రైతులు లబ్ధి పొందారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టడీ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 5 శాతం, మధ్యప్రదేశ్ 12% జార్ఖండ్ 13 శాతం పంజాబ్ 24% కర్ణాటక 38% ఉత్తర్ ప్రదేశ్ 52% .పంట రుణాల మాఫీ పథకం ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలను పరిశీలిస్తే పాలకుల వాగ్దానాలు వాటి అమలులో కొనసాగుతున్న నిర్లక్ష్యం క్షమించరానిదని వారు తెలిపారు.

విత్తనం పెట్టిన దగ్గర నుండి పంటలు చేతికొచ్చి అమ్ముకునే వరకు ఎదురవుతున్న అనేక సమస్యలు రైతులను కృంగతీస్తున్నాయి. మరోవైపు పాలకుల వాగ్దానాలు అమలు కాని తీరు పట్ల రైతాంగం తీవ్రమైన ఆగ్రహంతో ఉంది.

తుఫాన్ వల్ల నష్టపోయిన పంటలు, పంట రుణాలు మాఫీ కాక కొత్త రుణాలు బ్యాంకు నుండి తీసుకునే అవకాశం లేక వడ్డీ వ్యాపారస్తుల  అధిక వడ్డీలకు అప్పులు చేసుకొని రెండుకోసారి విత్తనాలను నాటుకోవాల్సిన పరిస్థితి. ఒకేసారి పంట రుణాలను మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని గత సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఇతర రైతు సంఘాలు గగ్గోలు పెట్టినా  పాలకులు పట్టించుకోలేదు వెంటనే రుణాలను మాఫీ చేసి కొత్త బ్యాంకు రుణాలు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. తుఫాన్ లో దెబ్బతిన్న పంటలకు ఎకరాకు పదివేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని వారు తెలిపారు.

Related posts

రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి నిమ్మగడ్డ కితాబు

Satyam NEWS

బాలికా విద్యపై కళాజాత ప్రదర్శన విజయవంతం

Satyam NEWS

ఎలర్ట్: మర్కజ్ మత ప్రార్ధనలకు వెళ్లిన వారెవరో చెప్పండి

Satyam NEWS

Leave a Comment