30.7 C
Hyderabad
April 29, 2024 03: 51 AM
Slider మహబూబ్ నగర్

బాలికా విద్యపై కళాజాత ప్రదర్శన విజయవంతం

#GirlEducation1

నాగర్ కర్నల్ జిల్లాలో రూమ్ టు రీడ్ ఇండియా ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలికా విద్యపై ఈదమ్మ గుడి దగ్గర, బస్ స్టాండ్ సమీపంలో కళాజాత ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా మున్సిపల్ ఛైర్మన్ కల్పన, వార్డు సభ్యులు కావలి శ్రీనివాస్, శకుంతలబాయ్, సఖి సెంటర్ కౌన్సలర్ సునీత పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కల్పన మట్లాడుతూ బాలికలు పౌష్టికాహారంలోపం, బాలకార్మికుల నిర్మూలన, బాల్యవివాహాలు నిర్మూలన, ఎక్కువగా కృషి చేయాలని తెలిపారు. బాలికలు పాఠశాలలో మంచిగా చదువుకోవాలని సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పిస్తూ బాలికలు చదువుకోవడానికి సమయాన్ని కేటాయించడంలో తల్లిదండ్రులు బాధ్యత వహించాలని అన్నారు.

13 వార్డు కౌన్సలర్ కావలి శ్రీనివాస్ మాట్లాడుతూ బాల్యవివాహాలను అరికడదాం.. బాలికలను చదవనిద్దాం అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమం నిర్వహించడం పట్ల సంస్థ ప్రతినిధులను అభినందించారు. ప్రతి ఒక్కరు భాగస్వామ్యులై బాలికా విద్య కోసం కృషిచేయాలన్నారు.

ప్రతి అడుగు మా అమ్మాయితోనే మేము మా అమ్మాయిని బడి మాన్పించం అని తెలియజేశారు.  రూమ్ టు రీడ్ ఇండియా ట్రస్ట్ ప్రతినిధులు అరుణ్ సందీప్, శ్రీలత, ఉదయశ్రీ, పాల్గొన్నారు.

సఖి సెంటర్ కౌన్సలర్ సునిత మాట్లాడుతూ కళాజాత ప్రదర్శన ద్వారా బాలికా విద్యను చాల చక్కగా వివరించారు. రూమ్ టు రీడ్ ఇండియా ట్రస్ట్ వారు ఈ కార్యక్రమం నిర్వహించడం ద్వారా బడికి పంపిస్తే ఏమౌతుంది, పోషకాహారం తింటే బాలికలు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో వివరించారు.

మనందరం చేయి చేయి కలుపుదాం.. బాలికా విద్యను ప్రోత్సహిద్దాం అని తెలియజేశారు.

Related posts

కరోనా పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలి

Satyam NEWS

అందాల శ్రీమతులు ఫ్యాషన్ హుందాలు

Satyam NEWS

(Sale) Differencebetween Hemp Seed Oil And Cbd

Bhavani

Leave a Comment