38.2 C
Hyderabad
May 5, 2024 19: 49 PM
Slider ప్రత్యేకం

కేంద్ర మాజీ మంత్రి అశోక్ ఇంటి వద్ద టెన్షన్… టెన్షన్…

#ashokgajapatiraju

కేంద్ర మాజీమంత్రి, టీడీపీ పోలీట్ బ్యూరో నేత అశోక్ గజపతిరాజు బంగ్లా వద్ద సాయంత్రం టెన్షన్ వాతావరణం నెలకొనింది. సాయంత్రం నాలుగు న్నరకు అశోక్ బంగ్లాలో ఆ పార్టీ నేతలతో పాటు అరకు పార్లమెంటు అధ్యక్షురాలు గుమ్మడి సంధ్యారాణి మీడియా సమావేశం జరుగుతున్న సమయంలో…ఒక్కసారిగా అశోక్ బంగ్ల కాస్త వార్తలకెక్కింది.

ఆ మీడియా సమావేశం అయిన వెంటనే మరో గంట లో నగరంలో కోట జంక్షన్ నకు తెలుగు యువత ,టీఎన్ఎస్ఎఫ్ నేతలంతా ర్యాలీ గా బయలు దేరే సమయంలో పోలీసులు బంగ్లా వద్ద మొహరించారు. వన్ టౌన్ సీఐ మురళీ ,రూరల్ సీఐ మంగవేణి లు తమ,తమ సిబ్బంది తో టీడీపీ నేతలను బంగ్లా నుంచీ కోట జంక్షన్ వద్దకు రాకుండా బంగ్లా గేట్ వద్ద నిలువరించారు.

ప్రజల సమస్యల కోసం ఓ రాజకీయ పార్టీ గా రోడ్ల మీదకు వెళ్ల కుండా అడ్డుకోవడంపై టీడీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీంతో ఎత్తు బ్రిడ్జి నుంచీ ఆర్ అండ్ బీ అతిథిగృహం వరకు ట్రాఫిక్ స్తంభించింది. మొత్తానికి టీడీపీ నేతలను బంగ్లా నుంచీ రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు.

Related posts

శ్రీవారి సేవ‌లో ఎంపీ సీఎం

Sub Editor

శ్రీలంక చేతిలో ఓటమి పాలైన పాకిస్తాన్

Satyam NEWS

విజయనగరం పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణకు చర్యలు

Satyam NEWS

Leave a Comment