36.2 C
Hyderabad
May 14, 2024 16: 59 PM
Slider విజయనగరం

విజయనగరం పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణకు చర్యలు

#trafficpolice

విజయనగరం జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణకు “సత్యం న్యూస్. నెట్” చెప్పిన ట్రాఫిక్ అడ్వయిజరీ కమిటీ మీటింగ్ నిర్వహించాలని చెప్పిన సూచనను ఎట్టకేలకు జిల్లా పోలీసు శాఖ అందునా కొత్తగా వచ్చిన ఎస్పీ దీపిక పాటిల్…అమలు చేయబోతున్నారు. ఈ మేరకు విజయనగర డీఎస్పీ అనిల్, ట్రాఫిక్ డీఎస్పీ మోహన్ రావులతో కలిసి నగరంలో పర్యటించారు.

మనగరంలోని ముఖ్య కూడళ్ళలో జిల్లా ఎస్పీ  ఎం. దీపిక సందర్శించి ట్రాఫిక్ అధికారులకు, సిబ్బందికి ట్రాఫిక్ క్రమబద్దీకరణకు తీసుకోవాల్సిన చ్యలు గురించి పలు సూచనలు చేశారు. జిల్లా ఎస్పీ విజయనగరం పట్టణం గంటస్థంబం వద్ద రోడ్డు ప్రక్కన ఉన్న పండ్ల దుకాణాలు, చిరు వ్యాపారులతో మాట్లాడి వారికి కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించి, తప్పనిసరిగా మాస్కు ధరించాలని అవగాహన కల్పించారు.

జిల్లా ఎస్పీ వెంట విజయనగరం డీఎస్పీ పి. అనిల్ కుమార్, ట్రాఫిక్ డీఎస్పీ ఎల్.మోహనరావు, విజయనగరం వన్ టౌన్ సీఐ జె.మురళి, టూటౌ సీఐ సి. హెచ్. లక్ష్మణరావులు ఉన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ విజయనగరం ట్రాఫిక్ పీ.ఎస్ ను సందర్శించారు. రికార్డులను పరిశీలించి స్టేషను ప్రాంగణం లో ఉన్న వాహనాలను త్వరితగతిన డిస్పోజ్ చెయ్యమని, పెండింగ్ లో ఉన్న కేసులలో త్వరితగతిన దర్యాప్తు పూర్తిచేయాల్సిందిగా ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహనరావును ఆదేశించారు.

Related posts

అప్పుల ఊబిలో కూరుకు పోతున్న తాత్కాలిక సమగ్ర శిక్ష ఉద్యోగులు

Satyam NEWS

రవిందర్ రెడ్డి నగర్ కాలనీ సమస్యలు పై వినతి

Satyam NEWS

జంతువులు పక్షుల దాహం తీర్చేందుకు ఏర్పాట్లు                       

Satyam NEWS

Leave a Comment