28.7 C
Hyderabad
May 6, 2024 09: 04 AM
Slider మహబూబ్ నగర్

ప్రజా సంక్షేమమే నరేంద్రమోదీ ప్రభుత్వ ధ్యేయం: బీజేపీ

#bjpkollapur

దేశవ్యాప్తంగా గరీబ్ అన్న కల్యాణ్ యోజన పథకం ద్వారా మరో 6నెలల పాటు పేద ప్రజలందరికీ ఉచిత ఆహారధాన్యాలను అందిస్తామని భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలుపుతూ నేడు బీజేపీ కొల్లాపూర్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌరస్తాలో నరేంద్రమోదీ చిత్రపటానికి మండల అధ్యక్షులు తమటం సాయికృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ దేశంలో నరేంద్రమోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి నేటి వరకు సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తుందని గుర్తుచేశారు. ప్రపంచాన్ని కకావికలం చేసిన కరోనా లాక్డౌన్ సమయంలో దేశ ప్రజలు ఆకలితో అలమటించొద్దనే ఉద్దేశ్యంతో గరీబ్ అన్న కళ్యాణ్ యోజన పథకం ప్రవేశపెట్టి దాని ద్వారా ఉచిత ఆహారధాన్యాలు అందించడం ద్వారా కోట్లాది మంది ప్రజలకు ఉపశమనం కలిగిందని,ఈ పథకంలో నెలవారీ కోటాకు 5కేజీల పెంచి మరి అందజేస్తున్నారు. ఈ పథకం ద్వారా దేశంలో సుమారు 80కోట్ల మంది లబ్ది పొందుతున్నారు. కరోనా పరిస్థితుల నుంచి ఇంకా పూర్తిగా కొలుకోలేదని భావించి ఈ పథకాన్ని ఇంకో 6 నెలల పాటు పొడిగించడం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

రాష్ట్రంలో సంక్షేమ పథకాలపై దృష్టి సారించాల్సిన రాష్ట్రప్రభుత్వం దానిని విస్మరించి, కేంద్రప్రభుత్వ పథకాలను తమ పథకాలుగా చెప్పుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా ప్రజాసంక్షేమంపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.. కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా అధికార ప్రతినిధి తమటం శేఖర్ గౌడ్, సీనియర్ నాయకులు సందు రమేష్, మహిళా మోర్చా అధికార ప్రతినిధి రోజారమణి, BJYM జిల్లా అధ్యక్షులు మూలే భరత్ చంద్ర, మహిళ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శశిరేఖ,ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి కడ్తాల కృష్ణయ్య,పట్టణ ప్రధాన కార్యదర్శులు ఇమ్రాన్,ఎల్లయ్య, BJYM అసెంబ్లీ కన్వీనర్ పరుశురాం,పట్టణ అధ్యక్షులు శివకృష్ణ యాదవ్,నాయకులు జ్యోతి,మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు భారతి, బాలకృష్ణ, మద్దిలేటి, మహేష్,రమేష్,చందూ యాదవ్,విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రజలకు కరోనా సాయం కోసం ఆలపాటి నిరాహారదీక్ష

Satyam NEWS

డీఆర్ఓ స‌హ‌కారం లేనిదే క‌లెక్ట‌ర్ ముందు కెళ్ల‌లేరా..?

Satyam NEWS

వనపర్తిలో పత్రికల ప్రభావం పని చేయదు

Satyam NEWS

Leave a Comment