38.2 C
Hyderabad
May 3, 2024 22: 15 PM
Slider నల్గొండ

కేంద్ర ప్రభుత్వంపై సమ్మె సమర శంఖం పూరిద్దాం: సిఐటియు

#CITUC

కార్మికులు,ఉద్యోగులు,ప్రజా సైన్యం సమరానికి సిద్ధం కావాలని,వినకపోతే మరో యుద్ధమే నని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి,భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని  హెచ్చరించారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో మార్చి 28,29, సోమ,మంగళ వారాల్లో జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయటానికి సిఐటియు అనుబంధ వివిధ సంఘలతో ప్రదర్శన,అనంతరం శిల్పకల బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో హుజూర్ నగర్ పట్టణ ప్రధాన రహదారిపై భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం శీతల రోషపతి,యల్క సోమయ్య గౌడ్  మాట్లాడుతూ అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక హక్కులను హరించే బి జె పి ప్రభుత్వంపై పోరాటం ద్వారానే సాధించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ పోరాటంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.28వ,తేదీన ఐక్య కార్మిక సంఘాలు ఐ ఎన్ టి యు సి, ఏఐటియుసి, సిఐటియు, ఐ ఎఫ్ టి యు,టి ఎన్ యు సి,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు,ప్రైవేట్,కాంట్రాక్ట్ కార్మికుల ఆధ్వర్యంలో మిర్యాలగూడ చౌరస్తా, మున్సిపల్ కార్యాలయం నుండి ప్రదర్శన ప్రారంభమై పొట్టి శ్రీరాములు సెంటర్ నందు సభ జరుగుతుందని అన్నారు.

29వ,తేదీన చలో సూర్యాపేటకు పెద్ద ఎత్తున కార్మికులు కదిలి రావాలని ఉద్యోగ,కార్మిక,ప్రజా వర్గానికి తెలిపారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ,ప్రభుత్వ రంగంలో కాంట్రాక్ట్ కార్మికులు, కార్మికవర్గం అందరూ పాల్గొని దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం పట్టణ అధ్యక్షుడు ఉప్పతల వెంకన్న,మండల ప్రధాన కార్యదర్శి షేక్ ముస్తఫా,పర్వతాలు, మేరిగ దుర్గారావు,పల్లపు రామకృష్ణ,షేక్ బాబులు,దారా శామ్,ఏసుబాబు, పెరుతోడి శ్రీనివాస్,పిహాల్ రాజు,పిహాల్ రాకేష్,నకిరేకంటి అంజయ్య,నందిపాటి సైదులు,వీర నాగేశ్వరరావు,నాగరాజు, సతీష్,రామకృష్ణ,వీరబాబు,నాగుల్ మీరా,తదితరులు పాల్గొన్నారు.

Related posts

మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటీవ్ నిర్ధారణ

Satyam NEWS

రెడ్ ఎలర్ట్: కామారెడ్డిలో కరోనా అనుమానిత కేసు

Satyam NEWS

త్వరలో అన్ని జిల్లాల్లో కోవిడ్ టెస్టింగ్ ల్యాబ్ లు

Satyam NEWS

Leave a Comment