31.2 C
Hyderabad
May 3, 2024 00: 50 AM
Slider సంపాదకీయం

టార్గెట్ పవన్ కల్యాణ్: చేసెయ్ తప్పుడు ప్రచారం

#pawankalyan

చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ కలిసి మాట్లాడుకున్న నాటి నుంచి సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లను కొందరు కావాలని పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ను అత్యంత దారుణంగా విమర్శిస్తూ చేస్తున్న ప్రచారం రోజు రోజుకూ శృతిమించుతోంది. పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకుంటే ఫర్వాలేదు కానీ మేం మూడు రాజధానులు పెడితే తప్పా అంటూ స్వయంగా ముఖ్యమంత్రి జగన్ చెప్పిన క్షణం నుంచి పవన్ కల్యాణ్ పై ట్రోలింగ్ మరింతగా పెరిగింది.

పవన్ కల్యాణ్ ను మొదటి నుంచి చంద్రబాబునాయుడి ఏజెంటు అంటూ ప్రచారం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు మరింత తీవ్ర పదజాలం వాడుతున్నారు. చంద్రబాబు నుంచి ప్యాకేజీ తీసుకున్నాడని ప్రచారం చేయడం ద్వారా సున్నిత మనస్కుడైన పవన్ కల్యాణ్ ను వేరేవిధంగా నిర్ణయం తీసుకునేలా చేయవచ్చునని వైసీపీ భావించింది. అయితే వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వను అంటూ స్పష్టంగా చెప్పిన పవన్ కల్యాణ్ ఆ నాటి నుంచి ఆ దిశగానే వర్కవుట్ చేస్తున్నారు.

చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిస్తే ఎన్నికలలో పెను ప్రభావం కనిపిస్తుంది. అందుకే వైసీపీ ఈ కలయిక ఉండరాదని శతవిధాలా ప్రయత్నించింది. వైసీపీకితోడు బీజేపీ కూడా చంద్రబాబు పవన్ కల్యాణ్ కలవకుండా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నది. బీజేపీ నాయకులు కొందరు చంద్రబాబునాయుడు అధికారం కోల్పోయి చాలా కాలం అయినా ఆయననే విమర్శిస్తూ వైసీపీకి కొమ్ము చాసేవారు. అలాంటి నేతలు ఇప్పుడు పవన్ కల్యాణ్, చంద్రబాబునాయుడు కలవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

చంద్రబాబుతో తమ పొత్తు ఉండదని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. బీజేపీతోనే పవన్ కల్యాణ్ వెళుతున్నారని మరి కొన్ని మీడియాల్లో విశ్లేషణాత్మక కథనాల పేరుతో వార్తలు వెలువడుతున్నాయి. బీజేపీ పవన్ కల్యాణ్ కలిసి పోటీ చేస్తారా? లేక పవన్ కల్యాణ్ బీజేపీ నుంచి దూరంగా జరిగి చంద్రబాబునాయుడికి దగ్గర అవుతారా? మూడు పార్టీలూ కలిసి పోటీ చేస్తాయా అనే అంశాలపై తప్పుడు వార్తలు విస్త్రతంగా ప్రచారం అవుతున్నాయి. రాజకీయ నాయకులకు కార్యకర్తలను పూర్తి అయోమయంలో ఉంచడం ద్వారా ప్రయోజనం పొందాలని అధికార వైసీపీ ప్రచారం చేస్తున్నదని జనసేన నాయకులు భావిస్తున్నారు.

పవన్ కల్యాణ్ ఫొటో పెట్టి, లేదా కాపు కులస్తుల ఇంటిపేరు పెట్టి క్రియేట్ చేసిన ఫేక్ ఐడిలతో పూర్తి స్థాయిలో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని జనసేన నాయకులు అంటున్నారు. జనసేన పేరుతో కూడా ఫేక్ ఐడిలు క్రియేట్ చేసి అందరిని తికమక పెడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా పవన్ కల్యాణ్ పై విషం చిమ్ముతున్న కొందరు ఆయనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం జన సేన నాయకులకు ఆందోళన కలిగిస్తున్నది. ప్రస్తుతం వైసీపీ టార్గెట్ పవన్ కల్యాణ్ అన్నట్లుగా ప్రచారం సాగుతున్నది.

Related posts

పాడవే…!

Satyam NEWS

కాళోజి ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలి

Satyam NEWS

ఊ(ఓ)ర్మిళ

Satyam NEWS

Leave a Comment