28.7 C
Hyderabad
May 6, 2024 10: 38 AM
Slider ప్రత్యేకం

వైన్స్ షాపులకు దరఖాస్తు ప్రక్రియ షురూ

#Wines

రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.వచ్చే రెండేండ్ల కాల పరిమితి (2023-25)కిగాను మద్యం దుకాణాల లైసెన్సుల ఎంపిక ప్రక్రియకు రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా దరఖాస్తులు మొదలయ్యాయి. మొదటి రోజు భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆగస్టు 21న లాటరీ నిర్వహించి దుకాణాలను కేటాయించున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 2,620 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటి లైసెన్సుల గడువు ఈ ఏడాది నవంబర్‌తో పూర్తవుతున్నది. దీంతో కొత్తగా లైసెన్సులను జారీ చేసేందుకు ఎక్సైజ్‌ శాఖ ప్రక్రియను ప్రారంభించింది. దుకాణాల సంఖ్య, రిజర్వేషన్లు యథాతధంగా కొనసాగనున్నాయి.దరఖాస్తు రుసుం గతంలో మాదిరిగానే రూ.2 లక్షలుగా నాన్‌ రిఫండబుల్‌, స్పెషల్‌ రీటెయిల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ ఎస్‌ఆర్‌ఈటీ ను రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజును డీడీ రూపంలో కానీ, చలాన్‌ రూపంలో కానీ చెల్లించవచ్చు. జిల్లాల వారీగా నిర్ధారిత కేంద్రాల్లో దరఖాస్తులు ఉదయం 11 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు స్వీకరిస్తారు. నాంపల్లిలో ఎక్సైజ్‌ కార్యాలయంలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తుకు అవకాశం ఒకే వ్యక్తి రాష్ట్రంలోని ఎక్కడైనా, ఎన్ని షాపులకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వుడ్‌ దుకాణాలకు ఆయా వర్గాల వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

కలెక్టర్ల ఆధ్వర్యంలో డ్రా నిర్వహించి లైసెన్సులు జారీచేస్తారు. వార్షిక ఆర్‌ఎస్‌ఈటీ (రీటెయిల్‌ షాప్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌) ఆరు సమానా వాయిదాల్లో చెల్లించవచ్చు. మొత్తం ఆర్‌ఎస్‌ఈటీలో 25 శాతం బ్యాంక్‌ గ్యారంటీ ఇవ్వాల్సి టుంది.ఉదయం10 నుంచి రాత్రి 11 గంటల వరకు , ఇతర ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు దుకాణాలను అనుమతిస్తారు. 21 సంవత్సరాల కన్నా తక్కువ వయసువారు, ఎక్సైజ్‌ చట్టం ప్రకారం శిక్ష పడినవారు, గతంలో ఎక్సైజ్‌ రెవెన్యూ ఎగ్గొట్టిన వారు, కోర్టు ద్వారా దివాలా తీసినట్టు ప్రకటించినవారు దరఖాస్తు చేసేందుకు అనర్హులు.

మొత్తం మద్యం దుకాణాలు- 2620, ఓపెన్‌ క్యాటగిరీ షాపులు- 1834, మొత్తం రిజర్వుడ్‌ షాప్‌లు- 786 కేటాయించారు. వాటిలో గౌడలకు- 393 (15 శాతం), ఎస్సీలు- 262 (10 శాతం), షెడ్యూల్డ్‌ ఏరియా ఎస్టీలకు- 95, నాన్‌ షెడ్యూల్డ్‌ ఎస్టీలకు- 36, ఎస్టీలకు మొత్తం- 131, 5 శాతం చొప్పున కేటాయిస్తారు.

Related posts

ఇటలీలో పాటలు పాడుతున్న చాణక్య

Satyam NEWS

రాజధాని విశాఖ లో ఇక విజయసాయి రెడ్డిదే హవా

Satyam NEWS

ముగిసిన ఇంటర్న్‌షిప్ కార్యక్రమం

Satyam NEWS

Leave a Comment