38.2 C
Hyderabad
May 5, 2024 21: 53 PM
Slider నల్గొండ

పెద్దగట్టు వేలం పాట లో గుత్తేదారుల కుమ్మక్కు

#Lingamantula Swami

8 లక్షలకు కొబ్బరి కాయ పాట పాడుకుని 16లక్షలు కు వేరేవారికి అమ్ముకున్న సంఘటనతో లింగన్న ఆదాయానికి గండి పడింది. లింగమంతుల స్వామి జాతర లో వివిధ హక్కులకు నిర్వహించిన వేలం పాటలో పాటకు వచ్చినవారు కుమ్మకై లింగమంతుల స్వామికి రావలసిన ఆదాయానికి గండికొడుతున్నారు. ప్రతిసారి గుత్తేదారులు ఇదే తంతుగా అక్రమమార్గంలో పోతూడటంతో దేవుడికి చేరాల్సిన ఆదాయం బడానేతల పాలవుతుంది.

గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే తక్కువ ధరకు పాడి దనార్జనకు పాలుపడుతూ తిలాపాపం తలపిడికెడు అన్న చందంగా పంచుకు తింటున్నారని ఆరోపిస్తున్నారు. ఏక్కడ జాతర జరిగిన ఆ జాతరలో విక్రయించే వివిధ రకాల వాటి పై దేవాలయం నకు ఆదాయాన్ని సమకూర్చుకోవడం మనం చూస్తూనే ఉన్నాం కానీ ఇక్కడ ఇన్ని సంవత్సరాలుగా జాతర జరుగుతున్న ఏమాత్రం ఆదాయం సమకూర్చుకోకపోవడం వింతగా ఉంది .

ప్రభుత్వాలు మారిన పాలకవర్గాలు మారిన అక్కడ వ్యక్తి మాత్రం మారలేదు అన్నిటిని ఏకం చేసే ఆ వ్యక్తి వల్ల గుడి ఆదాయం మాత్రం పెరగటం లేదు. బుధవారం పెద్దగట్టు ప్రాంగణంలో నిర్వహించిన వేలంపాటలో వేలం పాటను షెడ్డు కింద నిర్వహిస్తే పాటలో పాల్గొన్న కాంట్రాక్టర్లు మాత్రం పెద్దగట్టు చెరువు కట్టపై సమూహంగా ఏర్పడి నిర్దేశించిన దానికంటే తక్కువగా పాడాలని నిర్ణయించుకున్నారు.

కుమ్మకై తక్కువ ధరకు పాడిన వేలం పాటల విషయం లో మంత్రి గారూ,కలెక్టర్ జోక్యం చేసుకొని ప్రభుత్వం ధర కంటే తక్కువగా వచ్చిన వాటి టెండర్లను రద్దు చేసి మరల టెండర్లు పిలిచి దేవాలయనికి అధిక మొత్తంలో ఆదాయము సమకూరేలా చూడాలని పలువురు కోరుతున్నారు.

Related posts

సీతారామ పనుల్లో వేగం పెంచాలి

Bhavani

తెలంగాణ లో మందు బాబులకు గుడ్ న్యూస్

Satyam NEWS

సోము వీర్రాజుకు చుక్కలు చూపించిన ఏపి పోలీసులు…!

Satyam NEWS

Leave a Comment