40.2 C
Hyderabad
May 5, 2024 16: 12 PM
Slider జాతీయం

బ్రాహ్మణులపై ఆర్ఎస్ఎస్ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం

#Mohan Bhagwat

కుల వ్యవస్థపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్రమైన సంచలనం కలిగిస్తున్నాయి. ఆదివారం ముంబైలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ‘‘కుల వ్యవస్థ దేవుడు పెట్టింది కాదు బ్రాహ్మణులు (పండిట్లు) పెట్టింది’’ అని వ్యాఖ్యానించారు.

ఆర్ఎస్ఎస్ ఈ విధంగా కుల వ్యవస్థపై వ్యాఖ్యలు చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. కుల వ్యవస్థపై సొంత వ్యాఖ్యానాలు చేసిన మోహన్ భగవత్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ లు పెరిగిపోయాయి. దాంతో ఆర్ఎస్ఎస్ ఇప్పుడు దీనిపై తన వివరణ ఇచ్చింది. ‘పండిట్’ అంటే కులం అనే ఉద్దేశ్యం కాదని పండిట్ అంటే ‘మేధావులు’ అని మోహన్ భగవత్ చెప్పిన మాటకు అర్థం అని సంఘ్ సోమవారం స్పష్టం చేసింది.

ఆర్‌ఎస్‌ఎస్ ప్రచార ఇన్‌ఛార్జ్ సునీల్ అంబేకర్ మాట్లాడుతూ సర్‌ సంఘచాలక్ మరాఠీలో మాట్లాడటం వల్ల పండిట్ అంటే బ్రాహ్మణులు అని అందరూ అర్ధం చేసుకున్నారని, అయితే ఆయన చెప్పింది పండిట్ అంటే మేధావులు అని అర్ధం చేసుకోవాలని ఆయన కోరారు. ఆయన ఎప్పుడూ సామాజిక సామరస్యం గురించి మాట్లాడుతుంటారని వివరించారు.

RSS ఎప్పుడూ అంటరానితనానికి వ్యతిరేకంగా మాట్లాడుతుందని, అన్ని సామాజిక విభజనలను వ్యతిరేకిస్తుందని తెలిపారు.

Related posts

ప్రయివేటు ఆసుపత్రులను తక్షణమే జాతీయం చేయండి

Satyam NEWS

నగరి కమిషనర్ ను ఎందుకు సస్పెండ్ చేశారో తెలుసా?

Satyam NEWS

భద్రాచలంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లు

Satyam NEWS

Leave a Comment