35.2 C
Hyderabad
April 27, 2024 14: 05 PM
Slider నిజామాబాద్

6 వేల కోట్లకు 1500 కోట్లే బడ్జెట్లో పెడతారా..?

#enkata Ramana Reddy

రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు స్త్రినిది, అభయహస్తం, వడ్డీలేని రుణాలు 6 వేల కోట్లు బకాయిలు ఉంటే బడ్జెట్లో కేవలం 1500 కోట్లు మాత్రమే కేటాయిస్తారా అని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ మీద నమ్మకంతో ఈ బడ్జెట్లో డ్వాక్రా సంఘాలకు 10 వేల కోట్లు కేటాయిస్తుందని భావించామని తెలిపారు. ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసేదాకా సీఎం కేసీఆర్ వినే పరిస్థితి లేదన్నారు.

ఉద్యమాన్ని అణచివేయడంలో కేసిఆర్ ను మించిన వాళ్ళు లేరని, ఆర్టీసీ, మున్సిపల్ కార్మికులు, విఆర్ఏల ఉద్యమాలను బెదిరించి అణిచివేశరని తెలిపారు. మహిళలకు రావాల్సిన ఆరు వేల కోట్లు దగ్గర పెట్టుకుని ఏం చేస్తారు వీళ్ళు అనుకుంటున్నారేమోనని, తెలంగాణలో 2.5 కోట్ల మంది మహిళలు ఉన్నారని, వాళ్లంతా ఉద్యమిస్తే ఎలా ఉంటుందో ఉహించుకోవాలని సూచించారు.

తెలంగాణ ప్రజలకు షార్ట్ మెమరీ అని సీఎం భావిస్తున్నారని, షార్ట్ మెమరీ ప్రజలు తలుచుకుంటే ఏం చేస్తారో చూపించాలన్నారు. డ్వాక్రా సంఘాలకు డబ్బులు వచ్చేదాకా వదిలేది లేదని, ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తామని హెచ్చరించారు.

ఈ నెల 20 నుంచి 22 దాకా నిరాహార దీక్షలు చేపడతామని, 23 నుంచి తానే ఆమరణ దీక్షకు దిగుతానని, ప్రాణం పోయినా నిధులు విడుదల చేసేదాక దీక్షలు ఆపే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ప్రాణం పోవుడో.. పైసలు వచ్చుడో తేల్చుకుంటామన్నారు.

Related posts

పౌరుషానికి ప్రతీక కారంపూడి పల్నాటి ఉత్సవాలు

Bhavani

కాళోజి ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలి

Satyam NEWS

భారత సైనికులకు నిర్మల్ లో ఘన నివాళి

Satyam NEWS

Leave a Comment