37.2 C
Hyderabad
April 30, 2024 14: 20 PM
Slider సంపాదకీయం

నగరి కమిషనర్ ను ఎందుకు సస్పెండ్ చేశారో తెలుసా?

R K Roja

ఆయన ఏదో పెద్ద నేరం చేశాడని కాదు. ఆయన కుంభకోణానికి పాల్పడ్డాడని కాదు. ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నాడని కూడా కాదు. మరి చిత్తూరు జిల్లా నగరి మునిసిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా సస్పెండ్ చేయడానికి కారణం ఏమిటి?

ఇంకేముంటుంది, దరిద్రపుగొట్టు రాజకీయాలే. నగరి మునిసిపాలిటీ పరిధిలో మటన్ దుకాణాల మూసివేతపై కమిషనర్ వెంకట్రామిరెడ్డి కొద్ది రోజుల కిందట ఒక హెచ్చరిక చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున మటన్ దుకాణాలు మూసేయాలని లేకపోతే తగిన చర్యలు తీసుకుంటామని ఆ హెచ్చరిక సారాంశం.

అయితే దాన్ని ఎగతాళి చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులే సోషల్ మీడియా పోస్టులు పెట్టారు. మటన్ షాపులుకు కరోనాకు ఏమిటో సంబంధం అంటూ ఎగతాళి చేశారు. ఆ తర్వాత రెండు పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.

ఇన్ని రోజుల నుంచి తనను ఎగతాళి చేసిన రాజకీయ నాయకులకు నేరుగా సమాధానం చెప్పలేక వెంకట్రామిరెడ్డి ఒక సెల్ఫీ వీడియో పెట్టారు. మటన్ దుకాణాలు మూసేయమంటే ఆ పని చేయలేదు. అందువల్ల కరోనా వచ్చింది. ఇకనైనా జాగ్రత్తగా ఉండండి.

మేమూ, మా సిబ్బంది, పోలీసులు అందరూ ప్రాణాలకు తెగించి పని చేస్తున్నాము సహకరించండి. సరిగా మాస్కులు లేకపోయినా చేతికి గ్లౌజెస్ లేకపోయినా పని చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోయినా పని చేస్తున్నాం ప్రజలంతా సహకరించండి అని వీడియోలో చెప్పాడాయన.

ఇందులో తప్పేముందే అర్ధం కాదు. సస్పెండ్ చేసేశారు. కారణం ఏమిటంటే చిత్తూరు జిల్లాలో వైసీపీలో రెండు ముఠాలు ఘోరంగా తగాదా ఆడుకుంటున్నాయి. నగరి ఎమ్మెల్యే రోజాకు ఆ జిల్లాలో పాపులారిటీ ఎక్కువ. దాంతో ఆమెను తొక్కేసేందుకు ఆమె ప్రత్యర్థులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

ఇక నగరి నియోజక వర్గంలో ఎమ్మెల్యే రోజా ఏక పక్షంగా వ్యవహరిస్తుందని, సీనియర్ నాయకులను పట్టించుకోకుండా అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తోందనే ఆరోపణలు తరచూ చేస్తుంటారు. ఈ నేపధ్యంలో రోజా మీద సీఎం జగన్మోహన్ రెడ్డికి జిల్లా నేతలు అనేక ఫిర్యాదులు చేసినట్టు తెలుస్తోంది.

మంత్రి పెద్ది రెడ్డి రాంచంద్రారెడ్డికి సైతం రోజా తో విభేదాలు ఉన్నట్టు తెలుస్తోంది. సస్పెండ్ అయిన వెంకట్రామి రెడ్డి ఎమ్మెల్యే రోజాకు అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది. సస్పెన్షన్ వేటు వేయద్దని రోజా అదిష్టానానికి విజ్ఞప్తి చేసినప్పటికి జిల్లా నేతల ఒత్తిడితో వేటు తప్పలేదని తెలుస్తోంది.

రోజాను ఒంటరి చేసేందుకే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయనే చర్చ కూడా జరుగుతున్నది.

Related posts

శ్రీవారి భక్తులపై ఎండ ప్రభావం పడకుండా చూడండి

Satyam NEWS

Assurance: నాయీ బ్రాహ్మణులకు అండగా ఉంటాం

Satyam NEWS

మహంకాళి బోనాల పండుగ

Satyam NEWS

Leave a Comment