38.2 C
Hyderabad
May 3, 2024 22: 13 PM
Slider ముఖ్యంశాలు

బీజేపీ పాలనలో ఆర్థికవ్యవస్థ అస్తవ్యస్తం

#cpm

బీజేపీ పాలనలో ఆర్థిక, లౌకిక, రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ అస్తవ్యస్తంగా మారాయని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు విజయ్‌ రాఘవన్‌ పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. కొవిడ్‌`19 తర్వాత దేశంలో నిరుద్యోగ సమస్య మరింత ఎక్కువైందన్నారు. పెట్టుబడిదారులు పైపైకి ఎదుగుతుంటే పేదలు మాత్రం మరింత దిగువకు పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (ఎన్‌ఆర్‌ఈజీఎస్‌) నిర్వీర్యం చేసేందుకు కేంద్రం యత్నిస్తోందన్నారు. రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కలిసివచ్చే పార్టీలతో సీపీఎం ముందుకు సాగుతుందన్నారు. స్థానిక సుందరయ్య భవనంలో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలిసి విజయ్‌ రాఘవన్‌ మాట్లాడారు. దేశంలో ధరల పెరుగుదల అధికంగా ఉందని పట్టణాలతో పోలిస్తే పల్లెలపై దీని ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. కేంద్రం మరింతగా పన్నుల భారం మోపుతుందన్నారు. పార్లమెంటరీ, ప్రజాస్వామ్య విలువలను నాశనం చేస్తుందని ధ్వజమెత్తారు. విచ్చలవిడిగా డబ్బులు వినియోగించి ఎన్నికల్లో గెలవడమే కాకుండా ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనుగోలు చేస్తూ ప్రభుత్వాలను కూలదోస్తుందన్నారు. మైనారిటీ దళితులపై వివక్ష అధికం అవుతుందని అర్బన్‌ మావోయిజం పుంజుకోంటుందని ఆరోపించారు. విద్య, ఆరోగ్యం, ప్రజాపంపిణీ వ్యవస్థలు దెబ్బతింటున్నాయని తెలిపారు. గ్రామీణ పేదరిక నిర్మూలన కోసం పోరాడి సాధించుకున్న ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం యత్నిస్తోందన్నారు. ఓవైపు అధిక పనిదినాల కోసం డిమాండ్లు లేవనెత్తుతున్న పరిస్థితుల్లో ఉపాధి కల్పన పథకాలను నిర్వీర్యం చేయడం తగదన్నారు. లేబర్‌ కోడ్స్‌, వర్కర్స్‌ చట్టాలు అమలు కాకపోగా పెట్టుబడిదారి విధానాలు మరింతగా పుంజుకుంటున్నాయని తెలిపారు. సీఐటీయూ, అఖిల భారత కిసాన్‌ సంఫ్‌ు వంటి సంఘాలను కలుపుకుని వ్యవసాయ కార్మికుల సమస్యలపై ముందుకెళ్తామని స్పష్టం చేశారు.

బీజేపీ, టీఆర్‌ఎస్‌ ఘర్షణల కారణంగా ప్రజాసమస్యలు పక్కకు

బీజేపీ, టీఆర్‌ఎస్‌ ఘర్షణల కారణంగా రాష్ట్రంలో ప్రజాసమస్యలు పక్కదోవ పడుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తప్పుచేసిన వారిని శిక్షించడాన్ని సీపీఎం ఎక్కడా తప్పుపట్టదని, విచారణ జరగకుండానే దోషి ఆరోపణలు చేస్తూ తిట్టిపోసుకోవడమే పనిగా బీజేపీ, టీఆర్‌ఎస్‌ల తీరుందని ధ్వజమెత్తారు. కేంద్ర నిఘాసంస్థలను ప్రతిపక్షాలపైనే కేంద్రీకరణ చేయడం చూస్తే బీజేపీ తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలనే దుర్భుద్దిని వెల్లడిస్తుందన్నారు. పార్టీల ఫిరాయింపుల కోసం ఓ బాధ్యుడినే కేటాయించడం హాస్యాస్పదమన్నారు. ఒకటి, రెండు ఎన్నికల్లో కొన్నిస్థానాల్లో గెలిచినంత మాత్రాన తమే అధికారంలోకి వస్తామనుకోవడం బీజేపీ అవివేకానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఫ్యూడలిజాన్ని పారదోలి సెక్యులరిజాన్ని ప్రతిష్టించిన చరిత్ర తెలంగాణ ప్రజానీకనిదని స్పష్టం చేశారు. రాజకీయ దురుద్దేశాలతో ప్రజాసమస్యలు పక్కదోవ పడుతున్నాయన్నారు.

షర్మిల బీజేపీ వదిలిన బాణమే

షర్మిల బీజేపీ వదిలిన బాణమే అని అర్థమవుతుందన్నారు. దక్షిణ తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర సర్కారు సైతం వెనుకబడిరదన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ప్రాజెక్టులకు జాతీయ హోదా, కాజీపేట కోచ్‌ఫ్యాక్టరీ వంటివేవి కేంద్రం ఆచరణలో పెట్టలేదన్నారు. పోడుభూములు, అసంఘటిత రంగ కార్మికులు, ధరణి సమస్యలు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని పరిష్కారం దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. పోడు సర్వేల్లో లోపాలున్నాయని 36ఏళ్లుగా నివాసం, సొంత భూమిని పరిగణలోకి తీసుకోకపోవడం సరికాదన్నారు. గుత్తికోయలను రాష్ట్రం నుంచి వెళ్లాగొట్టాలనడం సర్వేలో వారిని పరిగణలోకి తీసుకోకపోవడం చట్టవిరుద్ధమన్నారు. దళిత బంధుతో పాటు ముస్లిం, బీసీ బంధు వంటి డిమాండ్లు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో వంటిని సైతం అమలుచేయాలని సీఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై కోర్టు తీర్పు ఇచ్చినా పట్టించుకోకపోవడం సరికాదన్నారు.

Related posts

మాజీ ఎంపీ నారాయణ రెడ్డి సంతాప సభకు హాజరైన మంత్రి

Satyam NEWS

దళితులను అవమానిస్తే సహించేది లేదు

Satyam NEWS

యాసంగి ధాన్యం సేకరణలో భారత్ లో నెం1 తెలంగాణ

Satyam NEWS

Leave a Comment