గురువారం నిజామాబాద్ లో జరిగిన మాజీ ఎంపీ నారాయణ రెడ్డి సంతాప సభ కార్యక్రమానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరై నారాయణ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నారాయణ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ నారాయణ రెడ్డి గారితో ఆయనకున్న బంధుత్వాన్ని ఆప్యాయతనీ గుర్తు చేసుకుంటూ వివిధ రంగాల్లో వారు చేసిన కృషిని కొనియాడుతూ శ్రద్ధాంజలి ఘటించారు.విద్యావేత్తగా,తెలంగాణ ఉద్యమకారుడిగా, రచయితగా,రాష్ట్ర చెరుకు సంఘానికి అధ్యక్షుడిగా నారాయణ రెడ్డి చేసిన సేవలను మంత్రి గుర్తుచేశారు.