28.7 C
Hyderabad
May 6, 2024 00: 10 AM
Slider నెల్లూరు

టీచర్ల కృషి వల్లనే కేఎన్ఆర్ స్కూలుకు ప్రఖ్యాతి

#KNR school

టీచర్ల కృషి వల్లనే కెఎన్ఆర్ స్కూలుకు ఇంతటి ప్రఖ్యాతి లభించిందని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రశంసించారు. జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ, ఆణి మత్యాలు పథకం కింద ప్రోత్సాహక నగదు పురస్కారాల కార్యక్రమం గురువారం కేఎన్ఆర్ స్కూల్లో జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో మంచి మార్కులు సాధించిన ఇద్దరు విద్యార్థులు కేఎన్ఆర్ స్కూలుకు చెందినవారు కావడం విశేషమని కొనియాడారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల భవిష్యత్తు బాగుపడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

తద్వారా కుటుంబానికి, సమాజానికి మేలు జరగాలని ఆయన భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనికి అనుకూలంగా అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. తాము చదువుకునే రోజుల్లో కనీస సౌకర్యాలు కూడా లేవని పేర్కొన్నారు. ప్రస్తుతం కార్పొరేట్ స్కూళ్లతో సమానంగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దాలని లక్ష్యంతో నాడు-నేడు పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు.

ఈ పథకం వల్ల మంచి ఫర్నిచర్, చక్కటి దుస్తులు, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం తదితర సౌకర్యాలు సమకూరాయని పేర్కొన్నారు. అమ్మ ఒడి కింద స్కాలర్షిప్లు ఇవ్వడంతో పాటు విద్యార్థులు మంచి ఇంగ్లీష్ నేర్చుకోవాలని సీఎం జగన్ భావిస్తే, దాన్ని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయని ఆక్షేపించారు.

ఇతర స్కూళ్ల టీచర్లు కేఎన్ఆర్ స్కూల్ ను ఆదర్శంగా తీసుకొని ముందుకు వచ్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులకు తమ శుభాశీస్సులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, విజయ డైరీచైర్మన్ రంగారెడ్డి,వైసిపి సేవాదళ్ అధ్యక్షుడు మాలెం సుధీర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ మూలె విజయభాస్కర్ రెడ్డి, కార్పొరేటర్లు మొయిళ్ళ గౌరమ్మ, సత్తార్,

నూనె మల్లికార్జున యాదవ్, ఒరిస్సా శ్రీనివాసరెడ్డి, రామ్మోహన్ యాదవ్ వైసీపీ నేతలు స్వర్ణ వెంకయ్య, కోటేశ్వర్ రెడ్డి, పాముల హరి ప్రసాద్, నవీన్ కుమార్ రెడ్డి, హరిబాబు యాదవ్, మోయిళ్ల సురేష్ రెడ్డి, రియాజ్, మేఘనాథ్ సింగ్, సూరి బాబు, కేఎన్ఆర్ స్కూల్ హెడ్మాస్టర్ విజయ ప్రకాష్, విద్యాధికారులు అధ్యాపకులు, వైసిపి కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు.

Related posts

ఏప్రిల్‌లో విశేష ప‌ర్వ‌దినాలు

Sub Editor 2

చిన్న మధ్య తరహా దినపత్రికల డైరీ ఆవిష్కరణ

Satyam NEWS

డిప్యూటీ సీఎం పాల్గొన్న కార్య‌క్ర‌మంలో…మీడియాకు సీట్లు క‌ర‌వు…!

Satyam NEWS

Leave a Comment